25 ఏండ్ల త‌ర్వాత కొండ‌గ‌ట్టుకు CM KCR.. అప్పుడు ఎలా ఉన్నారో చూశారా!

CM KCR | ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ కొండ‌గ‌ట్టులో ప‌ర్య‌టించ‌నున్నారు. దాదాపు రెండున్న‌ర ద‌శాబ్దాల‌ త‌ర్వాత కేసీఆర్ కొండ‌గ‌ట్టుకు వెళ్తున్నారు. తొలిసారిగా 1998లో కేసీఆర్ కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌ను ద‌ర్శించుకున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారిగా బుధ‌వారం కేసీఆర్ కొండ‌గ‌ట్టులో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొండ‌గ‌ట్టు ఆల‌య అభివృద్ధి ఇటీవ‌ల ప్ర‌క‌టించిన బ‌డ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. అంజ‌న్న స్వామివారికి పూజలు నిర్వహించిన తర్వాత ఆర్కిటెక్ట్‌ ఆనంద్ […]

25 ఏండ్ల త‌ర్వాత కొండ‌గ‌ట్టుకు CM KCR.. అప్పుడు ఎలా ఉన్నారో చూశారా!

CM KCR | ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ కొండ‌గ‌ట్టులో ప‌ర్య‌టించ‌నున్నారు. దాదాపు రెండున్న‌ర ద‌శాబ్దాల‌ త‌ర్వాత కేసీఆర్ కొండ‌గ‌ట్టుకు వెళ్తున్నారు. తొలిసారిగా 1998లో కేసీఆర్ కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌ను ద‌ర్శించుకున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారిగా బుధ‌వారం కేసీఆర్ కొండ‌గ‌ట్టులో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొండ‌గ‌ట్టు ఆల‌య అభివృద్ధి ఇటీవ‌ల ప్ర‌క‌టించిన బ‌డ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించిన సంగ‌తి తెలిసిందే.

అంజ‌న్న స్వామివారికి పూజలు నిర్వహించిన తర్వాత ఆర్కిటెక్ట్‌ ఆనంద్ సాయితో కలిసి సీఎం కేసీఆర్ ఆలయాభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు జరిపారు.

కొండగట్టు అంజ‌న్న‌కు మ‌రో 500 కోట్లు.. స్వామిని దర్శించుకున్న CM KCR

కొండగట్టులో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల‌ని భ‌క్తులు కోరుతున్నారు. ఘాట్ రోడ్ల అభివృద్ధి, ఆలయ ఆవరణలో గ్రీనరీ ఏర్పాట్లు, భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, నూతన కాటేజీల నిర్మాణం చేప‌ట్టాల‌ని భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు. న‌డ‌క‌దారిని అభివృద్ధి చేయ‌డంతో పాటు తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని భ‌క్తులు వేడుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి వచ్చారు

ఇదిలా ఉండగా ఈ రోజు సీఎం కేసీఆర్‌ కొండగట్టు పర్యటన నేపథ్యంలో నాడు కేసీఆర్‌ కొండగట్టుకు వచ్చిన చిత్రాలు ఇవేనంటూ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. మీరు వాటిని చూసేయండి మరి.

CM KCR RARE PHOTOS COLLETION