రాష్ట్ర, దేశ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన CM KCR

విధాత: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని CM KCR రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో ఆత్మశుద్దిని, పరివర్తనను కలిగిస్తాయని సీఎం అన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని సీఎం కోరారు. మహాశివుని(LORD SHIVA) కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలనీ సిఎం ప్రార్థించారు. లయకారునిగా, అర్ధనారీశ్వరునిగా, హిందువులు(HINDUS) కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరి […]

  • By: Somu |    latest |    Published on : Feb 18, 2023 10:17 AM IST
రాష్ట్ర, దేశ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన CM KCR

విధాత: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని CM KCR రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో ఆత్మశుద్దిని, పరివర్తనను కలిగిస్తాయని సీఎం అన్నారు.

ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని సీఎం కోరారు. మహాశివుని(LORD SHIVA) కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలనీ సిఎం ప్రార్థించారు. లయకారునిగా, అర్ధనారీశ్వరునిగా, హిందువులు(HINDUS) కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.