Miryalaguda: CMRF అక్రమాలు.. ప్రైవేటు ఆసుపత్రిలో డెమో తనిఖీలు

విధాత: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మహేష్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నకిలీ సిఎంఆర్ఎఫ్ బిల్లులతో రూ.4.54లక్షలు స్వాహా చేసిన వైనంపై నల్లగొండ జిల్లా వైద్యారోగ్యశాఖ మాస్ మీడియా ఆఫీసర్(డెమో)రవిశంకర్ సోమవారం తనిఖీ చేశారు. హాస్పటల్ లో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిష్టర్లు, వైద్యమందించిన డాక్టర్ వివరాలు, వాడిన మందులు, ఎన్ని రోజులు చికిత్స పొందారన్న అంశాలపై పత్రాలను పరిశీలించారు. సిఎంఆర్ఎఫ్ సహాయం పొందిన ముగ్గురు రోగుల వివరాలు, చిరునామాలను సేకరించారు. సిఎంఆర్ఎఫ్ […]

Miryalaguda: CMRF అక్రమాలు.. ప్రైవేటు ఆసుపత్రిలో డెమో తనిఖీలు

విధాత: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మహేష్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నకిలీ సిఎంఆర్ఎఫ్ బిల్లులతో రూ.4.54లక్షలు స్వాహా చేసిన వైనంపై నల్లగొండ జిల్లా వైద్యారోగ్యశాఖ మాస్ మీడియా ఆఫీసర్(డెమో)రవిశంకర్ సోమవారం తనిఖీ చేశారు. హాస్పటల్ లో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిష్టర్లు, వైద్యమందించిన డాక్టర్ వివరాలు, వాడిన మందులు, ఎన్ని రోజులు చికిత్స పొందారన్న అంశాలపై పత్రాలను పరిశీలించారు.

సిఎంఆర్ఎఫ్ సహాయం పొందిన ముగ్గురు రోగుల వివరాలు, చిరునామాలను సేకరించారు. సిఎంఆర్ఎఫ్ మంజూరుకై ఏ ఎమ్మెల్యే ద్వారా దరఖాస్తులను పంపారని ప్రశ్నించారు. మిర్యాలగూడ, హుజూర్ నగర్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ద్వారా పంపారా అనే విషయాన్ని విచారించగా అక్కడి నుండి సంబంధిత నకిలీ రోగుల బిల్లులు పంపలేదని తెలిసింది. వారే ఎమ్మెల్యేల సంతకం ఫోర్జరీ చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

బిల్లుల కోసం ఏ ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. స్వాహా విషయం బయట పడిన అనంతరం విచారణ చేస్తున్న సిసిఎస్ పోలీసులు వివరాలు పంపాల్సిందిగా వైద్యారోగ్య శాఖను ఆదేశించగా మిర్యాలగూడ డిప్యూటి డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ కె.రవి విచారణ చేసి నివేదించారు. తిరిగి నేడు డెమో విచారణ జరిపారు. మరోసారి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి తనిఖీ చేసి నివేదిక సమర్పించనున్నారని తెలిసింది.