Taapsee Pannu | ఆ.. దుస్తులు అసభ్యకరంగా ఉన్నాయి.. బాలీవుడ్‌ బ్యూటీ తాప్సీ పన్నుపై కేసు నమోదు!

Taapsee Pannu | దేవుళ్లను కించపరిచారంటూ.. విధాత: ప్రముఖ నటి తాప్సీ పన్నుపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా, అశ్లీతను వ్యాప్తి చేసేలా ప్రదర్శన ఇచ్చారని ఆరోపిస్తూ హింద్ రక్షక్ సంఘటన్ ఫిర్యాదు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు, హింద్ రక్షక్ సంఘటన్ కన్వీనర్ ఏకలవ్య గౌర్ పలు ఆరోపణలు చేస్తూ తాప్సీపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. మార్చి 12న ముంబయి లాక్మే ఫ్యాషన్ […]

Taapsee Pannu | ఆ.. దుస్తులు అసభ్యకరంగా ఉన్నాయి.. బాలీవుడ్‌ బ్యూటీ తాప్సీ పన్నుపై కేసు నమోదు!

Taapsee Pannu |

దేవుళ్లను కించపరిచారంటూ..

విధాత: ప్రముఖ నటి తాప్సీ పన్నుపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా, అశ్లీతను వ్యాప్తి చేసేలా ప్రదర్శన ఇచ్చారని ఆరోపిస్తూ హింద్ రక్షక్ సంఘటన్ ఫిర్యాదు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు, హింద్ రక్షక్ సంఘటన్ కన్వీనర్ ఏకలవ్య గౌర్ పలు ఆరోపణలు చేస్తూ తాప్సీపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు.

మార్చి 12న ముంబయి లాక్మే ఫ్యాషన్ వీక్‌లో నటి ర్యాంప్ వాక్‌లో పాల్గొంది. ఇందులో భాగంగా ఆమె అసభ్యకరమైన దుస్తులు ధరించారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆమె లక్ష్మీదేవి లాకెట్‌ను కలిగిన నెక్లెస్ ధరించారని, అది హిందూ దేవుళ్లను అవమానించినట్లేనని పేర్కొన్నారు. లక్ష్మీ దేవిని కించపరిచారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.

View this post on Instagram

A post shared by Chutverse (@chutverse)

మార్చి 12 ముంబయిలో జరిగిన ఈ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న తాప్సీని గత కొన్ని రోజుల నుంచి పలువురు సోషల్‌ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలో ఆమె వేసుకున్న దుస్తులు అసభ్యకరంగా ఉన్నాయంటూ మండిపడుతున్నారు.

మరికొందరేమో ఆమె వేసుకున్న నెక్లెస్‌పై అభ్యంతరం చెబుతున్నారు. లక్ష్మీదేవిని, హిందూ దేవుళ్లను కించపరిచేలా.. అశ్లీతను వ్యాప్తి చేస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఛత్రిపుర పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి కపిల్‌ శర్మ పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. తాప్సీ కేసు నమోదవడం బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

Taapsee Pannu | డైటీషియన్‌కే తాప్సీ నెలకు ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..? సినీరంగంలోకి వారికి తప్పదంటున్న నటి..!