Congress | ఢిల్లీకి పాలమూరు నేతలు.. నేడు రాహుల్ గాంధీతో సమావేశం
Congress కాంగ్రెస్ లోకి పొంగులేటితోపాటు జూపల్లి, కూచకుళ్ల విధాత బ్యూరో, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ అసంతృప్త నేతలు ఢిల్లీకి బయలుదేరారు. గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పట్ల తిరుగుబాటు జెండా ఎగరవేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించారు. దీంతో పార్టీలోకి వస్తారని ఆశించిన బీజేపీ భంగపడింది. ఏఐసీసీ పెద్దల హామీతో పాలమూరు ఎంఎల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు, రాష్ట్ర […]

Congress
- కాంగ్రెస్ లోకి పొంగులేటితోపాటు జూపల్లి, కూచకుళ్ల
విధాత బ్యూరో, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ అసంతృప్త నేతలు ఢిల్లీకి బయలుదేరారు. గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పట్ల తిరుగుబాటు జెండా ఎగరవేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించారు. దీంతో పార్టీలోకి వస్తారని ఆశించిన బీజేపీ భంగపడింది.
ఏఐసీసీ పెద్దల హామీతో పాలమూరు ఎంఎల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు, రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ ఛైర్మన్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి, వనపర్తి జిల్లా పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డిలు బీఆర్ఎస్ వీడి హస్తం గూటిలో చేరనున్నారు. ఇందులో నాగం ఆదివారం సదరు నేతలు ఢిల్లీ బయలుదేరారు.
సోమవారం ఉదయం రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. దీంతో గత కొన్నాళ్లుగా నిస్తేజం అలుముకున్న పాలమూరు కాంగ్రెస్ లో జోష్ నింపుతోంది. రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత పాలమూరులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు రాహుల్ లేదా ప్రియాంక హాజరయ్యే అవకాశం ఉంది.
ఇందులో ఉమ్మడి పాలమూరుకు చెందిన ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొంటారు. దీన్ని పీసీసీ అధినేత రేవంత్ రెడ్డి కీలకంగా తీసుకొన్నారు. ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించేలా మరికొందరు నాయకులను ఆహ్వానించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.