నిమజ్జన వేళ.. స్టెప్పులేసిన సీపీ రంగనాథ్

  • By: Somu    latest    Sep 27, 2023 10:33 AM IST
నిమజ్జన వేళ.. స్టెప్పులేసిన సీపీ రంగనాథ్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్టెప్పులతో హోరెత్తించారు. బుధవారం ఆయన నిమజ్జనం కోసం తన ఇంటి నుంచి గణేష్ ప్రతిమను శోభాయాత్రగా తరలించారు.


ఈ సందర్భంగా సీపీ క్యాంప్ కార్యాలయ సిబ్బందితో కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు. గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని క్యాంప్ కార్యాలయంలో నవరాత్రులు పూజలు చేశారు. పూజలందుకున్న గణేషున్ని కుటుంబ సమేతంగా నిమజ్జనానికి తరలించారు.