Sukesh Chandrasekhar | ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో తర్వాత అరెస్ట్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌దే..! ఆర్థిక నేరగాడు సుకేశ్‌ సంచలన వ్యాఖ్యలు..!

Sukesh Chandrasekhar | మనీలాండరింగ్‌ కేసులో తీహార్‌లో జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ను పోలీసులు ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా మీడియా డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అరెస్ట్‌పై సుకేశ్‌ను విలేకరులు ప్రశ్నించగా.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిజం గెలిచిందని, ఇక అరవింద్‌ కేజ్రీవాల్‌ వంతు వచ్చిందన్నాడు. లిక్కర్‌ పాలసీ విషయంలో మరిన్ని అరెస్టులు ఉంటాయని, తర్వాత అరెస్ట్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌దేనంటూ బాంబు పేల్చాడు. లిక్కర్‌ స్కామ్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ […]

Sukesh Chandrasekhar | ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో తర్వాత అరెస్ట్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌దే..! ఆర్థిక నేరగాడు సుకేశ్‌ సంచలన వ్యాఖ్యలు..!

Sukesh Chandrasekhar | మనీలాండరింగ్‌ కేసులో తీహార్‌లో జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ను పోలీసులు ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా మీడియా డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అరెస్ట్‌పై సుకేశ్‌ను విలేకరులు ప్రశ్నించగా.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిజం గెలిచిందని, ఇక అరవింద్‌ కేజ్రీవాల్‌ వంతు వచ్చిందన్నాడు. లిక్కర్‌ పాలసీ విషయంలో మరిన్ని అరెస్టులు ఉంటాయని, తర్వాత అరెస్ట్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌దేనంటూ బాంబు పేల్చాడు. లిక్కర్‌ స్కామ్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమేయం త్వరలోనే బయటపడుతుందని చెప్పాడు.

ఇదిలా ఉండగా.. సుకేశ్‌ చంద్రశేఖర్‌ గతంలోనూ కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. స్టేషనరీ కుంభకోణంపై ఆరోపణలు చేస్తూ తన న్యాయవాది ద్వారా లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖలో కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేశాడు. మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌ పేద పిల్లల చదువుల విషయంలో కుంభకోణానికి పాల్పడ్డారని, పిల్లల పంపిణీకి సిద్ధం చేసిన మొదటి ముసాయిదా టెండర్‌ను 20శాతం ఎక్కువ ఇవ్వాలనే దురాశతో మరో కంపెనీకి ఇచ్చారని ఆరోపించాడు. మరో వైపు సుకేశ్‌ చంద్రశేఖర్‌ రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. ఈ కేసులో బాలీవుడ్‌ బ్యూటీలు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌తో పాటు నోరా ఫతేహిని పలుసార్లు దర్యాప్తు సంస్థలు విచారించాయి. అలాగే పలువురు బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు సైతం వినిపించాయి. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతున్నది.