ఐశ్వ‌ర్య‌రాయ్ కూతురు.. ఆరాధ్య స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..!

  • By: sn    latest    Oct 01, 2023 2:18 PM IST
ఐశ్వ‌ర్య‌రాయ్ కూతురు.. ఆరాధ్య స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వ‌ర్య‌రాయ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. విశ్వ‌సుంద‌రిగా, టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అమితాబ్ బ‌చ్చ‌న్ కోడ‌లు కావ‌డంతో ఆమె రేంజ్ మ‌రింత పెరిగింది. అభిషేక్ బ‌చ్చ‌న్‌ని పెళ్లి చేసుకొని పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాత ఐశ్వ‌ర్య‌రాయ్ సినిమాలు త‌గ్గించి ఎక్కువ స‌మ‌యాన్ని కుటుంబానికే కేటాయిస్తుంది.


 త‌న కూతురి ఆరాధ్య‌ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఆమెకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఆరాధ్య త‌ల్లిదండ్రుల‌తో పాటు తాత‌కి కూడా చాలా ఆస్తులు ఉండ‌డంతో ఆమె లైఫ్ చాలా రిచ్‌గా సాగుతుంది. ఆమె స్కూల్ ఫీజు కోస‌మే అన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు పెడుతున్నార‌ని తెలిసి అంద‌రు అవాక్క‌వుతున్న‌రు.

 అభిషేక్ బ‌చ్చ‌న్, ఐశ్వ‌ర్య‌రాయ్‌ల ముద్దుల కూతురు ఆరాధ్య ముంబాయ్‌లోని ధీరుభాయ్ అంబానీ అనే అత్యంత ఖ‌రీదైన ఇంటర్నేషనల్ స్కూల్ లో చ‌దువుతుంది. ఇందులో ఫీజులు ఎంతో తెలిస్తే మ‌న‌మైతే ఉలిక్కి ప‌డ‌తాం. అలాంటి స్కూల్‌లో ఆరాధ్య చ‌దువుకుంటుంది.


 ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఫీజు 10 లక్షల వరకు ఉంటుందని తెలుస్తుండ‌గా, ఎల్‌కేజీ నుంచి దాదాపు 5 లక్షలకు పైగా ఫీజ్ ఉంటుందట. అది కాకుండా పైన ఖర్చులు కూడా భారీగానే ఉంటాయ‌ని అంటున్నారు. ఇక 8వ తరగతి నుంచి 10 తరగతి వరకు.. ఆతరువాత ప్లస్ 1 ప్లస్ 2 గా పిలవబడే.. 11,12 ఇంటర్మీడియల్ క్లాసులకు కూడా 15 నుంచి 20 లక్షల పైనే ఫీజులు వ‌సూలుచేస్తున్న‌ట్టు స‌మాచారం.


 ఆరాధ్య ప్ర‌స్తుతం ఆర‌వ‌ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తుండ‌గా, ఆమె స్కూల్ కోసం దాదాపు రూ.20ల‌క్ష‌ల వ‌రకు ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు వినికిడి. ఇక ఆరాధ్య చ‌దువుకున్న స్కూల్ లో మరికొంత మంది సెలబ్రిటీల పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారట.


 రాబాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ చిన్న కొడుకు అబ్రహం అలానే సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, చుంకీ పాండే తదితర సెలబ్రిటీల పిల్లలు కూడా ఇదే స్కూల్‌లో తమ చదువును కొనసాగిస్తున్నార‌ట‌. ఇక ఆరాధ్య త‌ల్లి ఐశ్వ‌ర్య‌రాయ్ ఇటీవ‌ల పొన్నియన్ సెల్వన్ సినిమాలో మెరిసింది. అటు అభిషేక్ బచ్చన్ అడపాదడపా సినిమాలు, వెబ్ సీరిస్‌లు చేస్తున్నారు. బిగ్ బీ అమితాబచ్చన్ మాత్రం ఇప్పటికీ ఫుల్ ఫామ్ మెయింటేన్ చేస్తూ సినిమాలు, టీవీ షోల‌తో బిజీగా ఉన్నారు.