Donald trump | బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్‌.. ఆ జాబితాలో చోటు దక్కించుకున్న ట్రంప్‌..!

Donald trump | బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్‌.. ఆ జాబితాలో చోటు దక్కించుకున్న ట్రంప్‌..!

Donald trump ‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆ దేశ అధ్యక్ష పదవిని దక్కించుకునేందు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరగిని ప్రైమరీల్లో ఘన విజయం సాధించారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ను ట్రంప్‌ ఢీకొట్టబోతున్నాడు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖరారైన ట్రంప్‌కు అన్నీ కలిసొస్తున్నాయి.

తాజాగా బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్‌ విడుదల చేసిన ప్రపంచలోని అత్యంత కుబేరులైన 500 మంది జాబితాలో డొనాల్డ్‌ ట్రంప్‌నకు చోటుదక్కింది. సోమవారం అమెరికా మార్కెట్‌లు ముగిసే సమయానికి ట్రంప్‌ సంపద విలువ 4.18 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.33 వేల కోట్లు) పెరిగి 6.53 బిలియన్‌ డాలర్లకు చేరింది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆయన కంపెనీకి సంబంధించిన డీల్‌ ఒకటి తాజాగా పూర్తవడంతో ట్రంప్‌ ఆస్తుల విలువ భారీగా పెరిగింది.

గతంలో ఎన్నడూ ఆయన ఆస్తుల విలువ ఈ స్థాయిలో లేదని USA టుడే పేర్కొంది. ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ వాటా మంగళవారం ‘నాస్‌డాక్‌’లో 50 శాతానికి పైగా ప్రీమియంతో నమోదవ్వడం మరింతగా కలిసొచ్చింది. ఈ కంపెనీ మార్కెట్‌ విలువ సుమారు 10 బిలియన్‌ డాలర్లకు చేరింది. ట్రంప్‌కు ఈ కంపెనీలో మెజారిటీ వాటా (59%) ఉండడంతో ఆయన సంపద మరింత పెరిగింది.