హైద‌రాబాద్ రోడ్ల‌పై డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు.. ప్రారంభించిన సీఎస్, కేటీఆర్

Double decker buses | హైద‌రాబాద్ న‌గ‌ర రోడ్ల‌పై డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు దూసుకెళ్ల‌నున్నాయి. దీంతో భాగ్య‌న‌గ‌రానికి స‌రికొత్త శోభ రానుంది. మూడు ఎల‌క్ట్రిక్ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ, అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్ త‌దితరులు పాల్గొన్నారు. మొత్తం […]

హైద‌రాబాద్ రోడ్ల‌పై డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు.. ప్రారంభించిన సీఎస్, కేటీఆర్

Double decker buses | హైద‌రాబాద్ న‌గ‌ర రోడ్ల‌పై డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు దూసుకెళ్ల‌నున్నాయి. దీంతో భాగ్య‌న‌గ‌రానికి స‌రికొత్త శోభ రానుంది. మూడు ఎల‌క్ట్రిక్ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ, అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్ త‌దితరులు పాల్గొన్నారు.

మొత్తం 6 ఎల‌క్ట్రిక్ డబుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను హెచ్ఎండీఏ ఆర్డ‌ర్ ఇచ్చింది. ప్ర‌స్తుతం మూడు బ‌స్సులు మాత్ర‌మే అందుబాటులోకి వ‌చ్చాయి. మిగ‌తా 3 బ‌స్సులు కూడా త్వ‌ర‌లోనే ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి రానున్నాయి. హైద‌రాబాద్ వ్యాప్తంగా 20 డబుల్ డెక్క‌ర్ బ‌స్సులు న‌డ‌పాల‌ని హెచ్ఎండీఏ నిర్ణ‌యించింది.

కొత్త‌గా అందుబాటులోకి వ‌చ్చిన ఎల‌క్ట్రిక్ బ‌స్సు ధ‌ర రూ. 2.16 కోట్లు. ఒక్క‌సారి బ‌స్సును ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణం చేయొచ్చు. ఒక బ‌స్సు ఛార్జింగ్ కావ‌డానికి 2 నుంచి రెండున్న‌ర గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఈ బ‌స్సుల్లో డ్రైవ‌ర్‌తో పాటు 65 మంది ప్ర‌యాణించేందుకు వీలుంది.