CS Shanti Kumari | నెల రోజుల్లోగా ఆర్ ఆర్ ఆర్ భూసేకరణ పూర్తి చేయండి.. అధికారులను ఆదేశించిన సీఎస్ శాంతి కుమారి
రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ ఆర్ ఆర్) కు అవసరమైన భూసేకరణను సెప్టెంబర్ రెండవ వారంలోగా పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.
భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం
కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీ
విధాత: రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ ఆర్ ఆర్) కు అవసరమైన భూసేకరణను సెప్టెంబర్ రెండవ వారంలోగా పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ఈ భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సచివాలయంలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ సంబంధించి వివిధ దశలలో పెండింగ్ లో ఉన్న భూసేకరణ ప్రక్రియ ను వేగవంతం చేయాలన్నారు. భూసేరణలో భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం అందేవిధంగా జిల్లా స్థాయి లో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసి, మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందించాలని ఆమె కలెక్టర్లను ఆదేశించారు. కోర్టు కేసుల పై ప్రత్యేక చొరవ తీసుకుని త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారులు శ్రీనివాస్ రాజు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవిన్ మిట్టల్, అటవీ శాఖ అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీష్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్ది, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లతో పాటు పలువురు అధికారులు పాల్లొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram