IAS Transfer | తెలంగాణలో 42మంది ఐఏఎస్‌ల, ఇద్దరు ఐపీఎస్‌ల బదిలీ
తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సి. సుదర్శన్ రెడ్డిని నియమించింది.

విధాత : తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సి. సుదర్శన్ రెడ్డిని నియమించింది. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అమ్రపాలి, ట్రాన్స్‌కో సీఎండీగా రోనాల్డ్ రోస్,
ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్‌కుమార్ సుల్తానియా,
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్,
కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఎం. రిజ్వీ,
హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్,
పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ సెక్రటరీగా అహ్మద్ నదీమ్,
జ్యోతి బుద్దఫ్రకాశ్‌ను రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ సెక్రటరీగా,
స్పోర్ట్స్ అథార్టీ ఎండీగా సోని బాలదేవి,
ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా లాంబార్తీ.కె,
ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా ఎ.శ్రీదేవసేన,
సెర్ఫ్ సీఈవోగా డి.దివ్య,
ఆర్‌ఆండ్‌బీ ప్రత్యేక కార్యదర్శిగా దాసరి హరిచందన,
సోషల్ వెల్ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషన్ సెక్రటరీగా అలుగు వర్షిణి,
హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీగా వీపి గౌతమ్,
ఉపాధి, శిక్షణ డైరక్టర్‌గా కృష్ణ ఆధిత్య,
హైదారాబాద్ మెట్రో వాటర్ సఫ్లయ్ సీవరేజీ డైరక్టర్‌గా కె.అశోక్‌రెడ్డి,
జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతి,
ఐటీ, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ డిప్యూటీ సెక్రటరీగా భావేశ్ మిశ్రా,
పర్యావరణ, కాలుష్య నియంత్రణ బోర్డు సెక్రటరీగా జి.రవి,
తెలంగాణ ఇనిస్ట్యూట్ ఆప్ రూరల్ డెవలప్‌మెంట్ డైరక్టర్‌గా కె.నిఖిల,
ఉద్యానవన శాఖ డైరక్టర్‌గా యాస్మిన్ భాష, ఫ్రోటోకాల్ విభాగం డైరక్టర్,
జాయింట్ సెక్రటరీగా ఎస్.వెంకట్రావు,
వ్యవసాయ సహకార శాఖ జాయింట్ సెక్రటరీగా పి.ఉదయ్‌కుమార్,
పశువైద్య శాఖ డైకర్టర్‌గా బి.గోపి,
మత్స్యశాఖ డైరక్టర్‌గా ప్రియాంక అల,
టూరిజం డైరక్టర్‌గా తిరుపతి,
జిహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా స్నేహా షభారీష్,
ఫైనాన్స్ కార్పోరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరక్టర్‌గా కాత్యాయిని దేవి,
స్కూల్ ఎడ్యూకేషన్ డైరక్టర్‌గా ఈవీ.నరసింహారెడ్డి,
మెడికల్ సర్వీస్, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరక్టర్‌గా బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు,
జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా హేమంత కేశవ్ పాటిల్,
కూకట్‌పల్లి జోనల్ కమిషన్‌గా అపూర్వ చౌహాన్,
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా పి.ఉపేందర్‌రెడ్డి,
టీ ఖమ్మం మున్సిసపల్ కార్పోరేషన్ చైర్మన్‌గా అభిషేక్ అగస్త్య,
ఐటీడీఏ పీవోగా బి.రాహుల్,
మూసీ రివర్ డెవల్‌మెంట్ కార్పోరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరక్టర్‌గా పి.గౌతమ్, టీజీఐసీ ఎగ్జీక్యూటీవ్ డైరక్టర్‌గా నిఖిల్ చక్రవర్తిలను నియమించారు. జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం కమిషనర్‌గా ఐపీఎస్ ఏవీ రంగనాథ్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ఐపీఎస్ ఎన్.ప్రకాశ్‌రెడ్డిలను నియమించారు.