Health Cards | ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇచ్చిన సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ ఉద్యోగులు, అధికారుల జేఏసీ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు జారీ చేయడంపై తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, కార్మిక, ఉపాధ్యాయుల, పెన్షనర్ల జేఏసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది.
హైదరాబాద్, విధాత:
Health Cards | ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు – Cashless (EHS) ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగులు, అధికారుల జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, కార్మిక, ఉపాధ్యాయుల, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, ఉప సెక్రటరీ జనరల్ &GS, TNGO’S Central Union ఎస్.ఏం.హుస్సేనీ ముజీబ్ హర్షం వ్యక్తం చేస్తూ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇవ్వటం, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మార్చి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మారుస్తూ, ఉద్యోగులకు రూ. 1.20 కోట్ల ప్రమాద బీమా, 60 సంవత్సరాల లోపు సహజ మరణం చెందితే 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ మంజూరు జేయడం లాంటి నిర్ణయాలు రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్నదని సంతోషం వ్యక్తం చేశారు.
గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతులకు అంగీకరించి వైద్య విధాన పరిషత్ ఏర్పాటు చేసి ఎంతో మంది ఉద్యోగులను మానసిక ఒత్తిడి కి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యవిధాన పరిషత్ ఉద్యగులకు నెలనాడు జీతాలు రాలేదని, అలాగే ప్రభుత్వం నుండి లభించే ఎలాంటి సౌకర్యాలు రాలేదన్నారు. వైద్యవిధాన పరిషత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి TGEJAC తరుపున ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. తమ విజ్ఞప్తి మేరకు ఈ ప్రజాప్రభుత్వం 12,500 మంది ఉద్యోగస్తులకు అలాగే 200 హాస్పిటల్స్ ఒక గొప్పవరం లభించిందన్నారు. వీరందరికి ఇక నుండి వారికి 010 పద్దు కింద నెలసరి జీతభత్యాలు , ఇతర ప్రయోజనాలు పొందుతారని తెలిపారు. అలాగే వైద్యవిధాన పరిషత్ లో పనిచేసే స్టాఫ్ నర్స్ లకు నర్సింగ్ ట్యూటర్ గా వెళ్ళే అవకాశం లభిస్తుందన్నారు. ఇది TGEJAC సంఘాల ఐక్యతకు నిదర్శనమని తెలిపారు.
తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, కార్మిక, ఉపాధ్యాయుల, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ నిరంతర కృషి వల్ల ఉద్యోగుల ఆరోగ్య కార్డులు (EHS) ,వైద్య విభాగం 010 పద్దుక్రింద జీతాలు తీసుకొనే ప్రక్రియ సాధ్యమైందన్నారు అలాగే భవిష్యతులో కూడ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయినా PRC,పెండింగ్ బిల్లులను నేలకు 700 కోట్ల నుండి 1500 కోట్లకు పెంచుకునేలా ఐక్యంగా ఉండి హక్కులు సాదినుకుందామన్నారు. హైల్త్ కార్డులతో పాటు వైద్యవిధాన పరిషత్ పేరు మార్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు ఉద్యోగుల ఉపసంఘం చైర్మన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క , మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ తోపాటు సీఎస్ కే రామకృష్ణారావు, IAS అధికారుల కమిటీ సభ్యలైన నవీన్ మిట్టల్,లోకేష్ కుమార్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram