Eesha rebba: అందం, అభినయం ఉన్నా కూడా అదృష్టం లేక కెరీర్లో వెనకబడి ఉన్న భామ ఈషా రెబ్బా. ఎన్ని సినిమాలు చేసిన కూడా ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రావడం లేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ప్రభంజనం ఓ రేంజ్లో ఉంటుంది. లంగావోణిలో అయినా, చీరకట్టులోనైనా, మోడ్రన్ దుస్తుల్లోనైనా సరే ఈషా రెబ్బా అందాలకి మతులు పోవల్సిందే. కమర్షియల్ హిట్ కోసం ఈతెలుగు హీరోయిన్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది. ఇక తాను హీరోయిన్గా, సైడ్ […]
Eesha rebba: అందం, అభినయం ఉన్నా కూడా అదృష్టం లేక కెరీర్లో వెనకబడి ఉన్న భామ ఈషా రెబ్బా. ఎన్ని సినిమాలు చేసిన కూడా ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రావడం లేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ప్రభంజనం ఓ రేంజ్లో ఉంటుంది. లంగావోణిలో అయినా, చీరకట్టులోనైనా, మోడ్రన్ దుస్తుల్లోనైనా సరే ఈషా రెబ్బా అందాలకి మతులు పోవల్సిందే. కమర్షియల్ హిట్ కోసం ఈతెలుగు హీరోయిన్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది. ఇక తాను హీరోయిన్గా, సైడ్ కారెక్టర్ ఆర్టిస్టుగా, స్పెషల్ రోల్స్ ఇలా ఏ అవకాశం వచ్చినా కూడా మిస్ చేసుకోవడం లేదు. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులని సైతం అలరించేందుకు సిద్ధమైంది.
మాయాబజర్ ఫర్ సేల్ అనే వెబ్ సిరీస్‌తో ఈషా రెబ్బా పలకరించనుండగా, దీని ప్రమోషన్స్‌లో భాగంగా సుమ అడ్డా షోకు గెస్టుగా వెళ్లింది. ఈ షోలో ఈషాతో పాటు రవి వర్మ, జెస్సీ, గౌతమి చల్లగుళ్లలు గెస్టులుగా వెళ్లి సందడి చేశారు. వీరు కొన్ని ఆటలు కూడా ఆడి మంచి మజా అందించారు. రీసెంట్గా ఈ షోకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ప్రోమోలో.. గౌతమి చల్లగుళ్ల చెప్పులు లేకుండానే కనిపించడంతో… సుమ ‘చెప్పులు ఎందుకు వేసుకోలేదు’ అని ప్రశ్నించింది. దీనికి గౌతమి సమాధానం ఇస్తూ.. ‘దేహమే దేవాలయం’ అంటూ పంచ్ వేసింది. అనంతరం సుమ ‘అవునండీ చెప్పులేనా? బంగారం కూడానాస అని అనగా, దానికి గౌతమి ‘నా మనసే బంగారం’ అంటూ మరో పంచ్ వేసింది.
‘సుమ అడ్డా’ షోలో ఇక ఓ బొమ్మ ఆవును తీసుకొచ్చి మా ఆవుకు ఒంట్లో బాలేదు అని చెప్పింది సుమ. దీంతో డాక్టర్లా ఓ అమ్మాయి వచ్చి ‘కంగ్రాట్స్ మీరు అమ్మమ్మ కాబోతున్నారుస అనగా, దానికి సుమ..ఆ ఆవును పుల్లటివి ఏమైనా తింటావా అని అడిగింది. ఆ తర్వాత ‘తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది’ అని ప్రశ్నించడంతో .. ఈషా రెబ్బా ‘తొందరపడ్డప్పుడు’ అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమల గురించి అడిగిన సుమ.. చివర్లో ‘ఈషా ఇప్పుడు నీ ప్రేమ గురించి చెప్పు’ అని ప్రశ్నించగా, దానికి ఈషా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని బాంబ్ పేల్చింది. అప్పుడు సుమ ‘వాళ్ల నాన్న ఎక్కడ ఉంటారు’ అని అడగగా, దానికి ఈషా చెప్పిన సమాధానంని మ్యూట్ చేశారు. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే శనివారం ప్రసారమయ్యే పూర్త ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.