పాకిస్థాన్‌లో ఒక్క కోడిగడ్డు ధర వింటే గుడ్లు తేలేయాల్సిందే!
పాకిస్థాన్‌లో దయనీయ పరిస్థితులు దాపురించాయి. కనీసం కోడి గుడ్లు కొనాలన్నా భయపడాల్సిన పరిస్థితి తలెత్తింది.
- కొనలేక గుడ్లు తేలేస్తున్న పాకిస్థానీలు
విధాత: పాకిస్థాన్‌లో దయనీయ పరిస్థితులు దాపురించాయి. కనీసం కోడి గుడ్లు కొనాలన్నా భయపడాల్సిన పరిస్థితి తలెత్తింది. గతంలో ఎన్నడూ లేనంతగా అక్కడ ఒక్క గుడ్డు ధర 32 రూపాయలకు చేరింది. పౌల్ట్రీలో ఉపయోగించే సోయాబీన్ సరఫరా తగ్గిపోవడంతో, నిర్వహణ పెరగడంతో గుడ్ల ధరలు అమాంతం పెరిగిగాయి. డజన్‌కు రూ.380 చిల్లర దుకాణాల్లో ఇప్పుడు ఒక్కో గుడ్డు రూ.35 వరకు విక్రయిస్తున్నారు. 30 డజన్ల గుడ్ల ధర రూ.10,500 నుంచి రూ.12,500కు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డజను గుడ్లను రూ.360కి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ, రిటైల్ వ్యాపారులు రూ.389కి అమ్ముతున్నారు. ఒక్కో గడ్డు ధర రూ.32కి చేరుకున్నది. లాహోర్‌లో మునుపెన్నడూ లేని స్థాయికి గుడ్డు ధరలను పెంచాయి. సోయాబీన్స్ దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, ఇంకా నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతున్నట్లు ఆల్ పాకిస్థాన్ బిజినెస్ ఫోరం తెలిపింది. ఆహారం, ఇంధనం ధరలు భారీగా పెరుగుతున్నాయని, జీవన ప్రమాణాలు క్రమంగా తగ్గుతున్నాయని పేర్కొన్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram