Kiran Kumar Reddy | బీజేపీలో చేరిన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
Kiran Kumar Reddy | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్టీ ముఖ్యనేతలు అరుణ్ సింగ్, లక్ష్మణ్ సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది మార్చి నెలలో కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా […]

Kiran Kumar Reddy | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్టీ ముఖ్యనేతలు అరుణ్ సింగ్, లక్ష్మణ్ సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది మార్చి నెలలో కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరడంతో ఏపీలో తమ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఏపీలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి వివిధ పదవులు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010 నవంబర్ 25 నుంచి 2014 మార్చి 1వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. సీఎం పదవి చేపట్టే కంటే ముందు అసెంబ్లీ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఆయన పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. అనంతరం కొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్.. తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇక ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తాజాగా బీజేపీలో చేరారు.