Faima | ఇదేం ట్విస్ట్‌.. అత‌డి వ‌ల్ల ప్రియుడు ప్ర‌వీణ్‌కి బ్రేకప్ చెప్పిన ఫైమా..!

Faima: జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపులారిటీ ద‌క్కించుకొని బిగ్ బాస్ షోలో అడుగు పెట్టిన క‌మెడీయ‌న్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఫైమా ఒక‌రు. అద్భుతమైన టాలెంట్లతో అదరగొట్టిన ఫైమా.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతుంది. ఇక ప్ర‌వీణ్‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతూ వార్త‌ల‌లో నిలుస్తుంది. 'పటాస్' అనే షో ద్వారా ఫైమా వెలుగులోకి రాగా, ఆ త‌ర్వాత‌ జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టి మంచి పేరు తెచ్చుకుంది.బిగ్ బాస్ షోలో మ‌గాళ్ల‌తో కూడా పోటీ ప‌డి అద‌ర‌గొట్టింది. ఒక‌వైపు […]

  • Publish Date - August 5, 2023 / 02:35 AM IST

Faima: జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపులారిటీ ద‌క్కించుకొని బిగ్ బాస్ షోలో అడుగు పెట్టిన క‌మెడీయ‌న్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఫైమా ఒక‌రు. అద్భుతమైన టాలెంట్లతో అదరగొట్టిన ఫైమా.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతుంది. ఇక ప్ర‌వీణ్‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతూ వార్త‌ల‌లో నిలుస్తుంది. ‘పటాస్’ అనే షో ద్వారా ఫైమా వెలుగులోకి రాగా, ఆ త‌ర్వాత‌ జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టి మంచి పేరు తెచ్చుకుంది.బిగ్ బాస్ షోలో మ‌గాళ్ల‌తో కూడా పోటీ ప‌డి అద‌ర‌గొట్టింది. ఒక‌వైపు ఆట ఆడుతూ మ‌రోవైపు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందిస్తూ 13వారాల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉంది. బిగ్ బాస్ త‌ర్వాత ఫైమా క్రేజ్ మ‌రింత పెరిగింది.

ఫైమా కొద్ది రోజుల క్రితం స్టార్ మాలో ప్రసారం అయిన ‘బీబీ డ్యాన్స్’ షోలో పాల్గొంది. సూర్యతో జ‌ట్టు క‌ట్టిన ఫైమా.. అదిరిపోయే డ్యాన్స్ చేసి ఏకంగా టైటిల్‌ను కూడా గెలిచారు. బిగ్ బాస్ త‌ర్వాత ఫైమా స్టార్ మాకి ఫిక్స్ అయిపోయింది. ‘స్టార్ మా పరివారం’ షోలో ప్ర‌తి వారం సంద‌డి చేస్తూ.. కొన్ని స్పెషల్ ఈవెంట్లలో కూడా పాల్గొంటోంది. మ‌రోవైపు సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ.. యూట్యూబ్ ద్వారా ప‌లు వీడియోలు షేర్ చేస్తూ త‌న రేంజ్ పెంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు త‌న క్రేజ్ పీక్స్‌లో ఉంది కాబ‌ట్టి దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క దిద్దుకోవాల‌ని అనుకుంటుంది.

ఇక పటాస్ షోలో చేస్తున్న‌ప్పుడు ప్ర‌వీణ్ తో ప‌రిచ‌యం ఏర్ప‌డ‌గా, ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ఈ ఇద్ద‌రు త‌మ ప్రేమ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు కూడా. బిగ్ బాస్‌లో ఉన్న‌ప్పుడు కూడా ఫైమా త‌న ప్రియుడు ప్ర‌వీణ్ గురించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకునేది. అయితే తాజాగా ఫైమా త‌న ప్రియుడికి బ్రేక‌ప్ చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఫైమా తాజాగా యూట్యూబ్ వీడియో షేర్ చేయ‌గా, ఈ వీడియోలో తాను ప్ర‌వీణ్‌తో బ్రేక‌ప్ చేసుకున్న‌ట్టు తెలియ‌జేసింది. బేబి సినిమా చూడ‌డం వ‌ల్ల‌నే ఇది జ‌రిగింద‌ని పేర్కొంది. ఇక ఆ వీడియోకి మరో వ్యక్తితో పెళ్లి అన్నట్లుగా థంబ్ క్రియేట్ చేయ‌డంతో అంద‌రు షౄక్ అయ్యారు.అయితే వీరు బేబి మూవీకి స్పూఫ్‌గా చేశారు త‌ప్ప నిజం కాద‌ని తెలిసి ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేశారు

Latest News