Bigg Boss7 | బిగ్‌బాస్‌లోకి బేబి హీరోయినా.. ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ..!

Bigg Boss7 | బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుంది. ఇప్ప‌టికే ప్రోమోలు ఒక్కొక్క‌టిగా రిలీజ్ చేస్తూ అంచ‌నాలు పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. హోస్ట్ నాగార్జున కాకుండా వేరే హీరో అయి ఉంటార‌ని ప్ర‌చారాలు సాగ‌గా, దానికి ప్రోమోతో క్లారిటీ ఇచ్చారు. ఈ సీజ‌న్‌కి కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక కంటెస్టెంట్స్ విష‌యంలోనే అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి.టీవీ నటులు అమర్ దీప్ చౌదరి, […]

  • By: sn    latest    Jul 22, 2023 7:09 AM IST
Bigg Boss7 | బిగ్‌బాస్‌లోకి బేబి హీరోయినా.. ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ..!

Bigg Boss7 |

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుంది. ఇప్ప‌టికే ప్రోమోలు ఒక్కొక్క‌టిగా రిలీజ్ చేస్తూ అంచ‌నాలు పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. హోస్ట్ నాగార్జున కాకుండా వేరే హీరో అయి ఉంటార‌ని ప్ర‌చారాలు సాగ‌గా, దానికి ప్రోమోతో క్లారిటీ ఇచ్చారు.

ఈ సీజ‌న్‌కి కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక కంటెస్టెంట్స్ విష‌యంలోనే అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి.టీవీ నటులు అమర్ దీప్ చౌదరి, తేజస్విని జంటను ఈసారి బిగ్ బాస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం..

ఐరావతం, రాజుగారి కిడ్నాప్ లాంటి సినిమాలతో పాటు సీరియ‌ల్స్ లో న‌టించాడు అమర్ దీప్. ఇక తేజస్విని కూడా పలు సీరియళ్లలో నటించి మెప్పించింది.. టీవి నటి శోభా శెట్టి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుండ‌గా, ఈమె.. తెలుగు, కన్నడ సీరియళ్లలో కనిపిస్తూ ఉంటుంది.

ఇక ఇప్పుడు బేబి హీరోయిన్ కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి పంప‌బోతున్న‌ట్టు ప్ర‌చారం న‌డుస్తుంది. ఆనంద్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన బేబి సినిమాతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చింది వైష్ణ‌వి. చిత్రంలో ఇద్దరు అబ్బాయిలతో ప్రేమాయణం నడిపే అమ్మాయి పాత్ర చేసి మెప్పించింది. అభ్యంతరకర సన్నివేశాల్లో న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు కూడా సంపాదించుకుంది.

బోల్డ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వైష్ణ‌వి..హౌజ్‌లో అడుగుపెడితే ర‌చ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది. తొలి సినిమాతో మంచి హిట్ అదుకొని ఫార్మ్ లోకి వచ్చిన వైష్ణవి బిగ్ బాస్ హౌస్లోకి వెళుతుందా లేదా అనే సందేహాలు కూడా కొంద‌రిలో కలుగుతున్నాయి.

ప్రస్తుతం ‘బేబీ’తో హిట్ అందుకున్న వైష్ణవి ఈ సినిమాకుగాను రూ.10 లక్షల లోపు రెమ్యునరేషన్ అందుకుందని టాక్.ఇక బ్యాంకాక్ పిల్ల‌ని కూడా హౌజ్‌లోకి తీసుకురాబోతున్నార‌ని స‌మాచారం. ఏదేమైన బిగ్ బాస్ షో ఈ సారి స‌రికొత్త‌గా ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచేదిగా ఉంటుంద‌ని తెలుస్తుంది.