బేబి సినిమా సూపర్ హిట్.. దర్శకుడికి బెంజ్ కారు గిఫ్ట్

ఇటీవల సినిమా ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ నడుస్తుంది. మంచి హిట్ అందించిన దర్శకులకి, లేదంటే హీరోలకి నిర్మాతలు కాస్ట్‌లీ కారు గిఫ్ట్‌గా ఇస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. కొద్ది రోజుల క్రితం జైలర్ హీరో రజనీకాంత్‌తో పాటు పలువురు టెక్నీషియన్స్‌కి జైలర్ నిర్మాత కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇవ్వడం చూసాం. ఇక ఇప్పుడు బేబి చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అతి పెద్ద విజయం అందించిన సాయి రాజేష్‌కి నిర్మాత ఎస్కేఎన్ కాస్ట్ లీ కారుని బహుమతిగా ఇచ్చాడు. ఈ గిఫ్ట్‌తో సాయి రాజేష్ ఆనందం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కారు బహుమతిగా అందుకున్న సాయి రాజేష్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక బేబి విషయానికి వస్తే సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. చిత్రాన్ని శ్రీనివాస కుమార్ (SKN) నిర్మించగా, ఈ చిత్రం కోసం ఆయన కేవలం 10 కోట్లు ఖర్చు పెట్టాడు. కాని ఈ చిత్రానికి 90 కోట్లకి పైగా వసూళ్లు వచ్చాయి. కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల నుండి కూడా ప్రశంసలు దక్కాయి. విమర్శకులు సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఓటీటీలో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది.

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా సాయి రాజేశ్ ఈసినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. అనుకోని విజయంతో పాటు.. భారీ కలెక్షన్లతో.. చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకున్న ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఇండస్ట్రీకి రాకముందు నుంచీ మంచి ఫ్రెండ్స్ కావడంతో ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకొని సినిమాని రూపొందించారు. వారి నమ్మకం సినిమా సూపర్ హిట్ అయ్యేలా చేసింది. ఇక బేబి సినిమా హిట్‌తో సాయి రాజేష్, ఎస్కేఎన్ కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. ఇది బేబిని మించి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.