Jailer | జైలర్ సినిమా కోసం రజనీకాంత్‌కి.. నిర్మాతలు ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!
Jailer | చాలా రోజుల తర్వాత రజనీకాంత్ నుంచి ఓ సూపర్ డూపర్ హిట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. తలైవా నటించిన జైలర్ చిత్రం ఆయన సత్తా ఏంటో మరోసారి చూపించింది. తెలుగు రాష్ట్రాల లోను ఈ సినిమాకి కాసుల వర్షం కురిసింది. రోబో తర్వాత రజనీకాంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి 650 కోట్ల కలెక్షన్లు దాటి 700కోట్ల క్లబ్ […]

Jailer |
చాలా రోజుల తర్వాత రజనీకాంత్ నుంచి ఓ సూపర్ డూపర్ హిట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. తలైవా నటించిన జైలర్ చిత్రం ఆయన సత్తా ఏంటో మరోసారి చూపించింది. తెలుగు రాష్ట్రాల లోను ఈ సినిమాకి కాసుల వర్షం కురిసింది. రోబో తర్వాత రజనీకాంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి 650 కోట్ల కలెక్షన్లు దాటి 700కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంది.
అయితే చిత్రం ఇంత అఖండ విజయం సాధించినందుకు నిర్మాతలు రజనీకాంత్‌కి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా కోసం రజనీకాంత్ 200 కోట్లు తీసుకోగా, ఇండియాలోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే యాక్టర్ గా ఆయన రికార్డ్ సెట్ చేశారు.
అయితే రజనీ.. జైలర్ సినిమా కోసం మొదట 110 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగా, తాజాగా ప్రాఫిట్స్ లో షేర్ మరో 100కోట్లు అందుకుని హయ్యస్ట్ పెయిడ్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు. చిత్రం పెద్ద విజయం సాధించి లాభాలు బాగా రాబట్టడంతో రజనీకాంత్ కి నిర్మాతలైన సన్ పిక్చర్స్ BMW ఎక్స్ 7 కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు
సాధారణంగా 100 కోట్లతో ఓ భారీ సినిమా తీసెయ్యొచ్చు అలాంటిది ఇప్పుడు హీరోలు వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత రజనీకాంత్ హిమాలయాలకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా సెప్టెంబర్ 7 నుంచి జైలర్ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అమెజాన్ ప్రకటించింది. థియేటర్ లో సినిమా చూడని వారు డైరెక్ట్‌గా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక జైలర్ సినిమా హిట్ జోష్‌తో తలైవా మరో సినిమాని మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం.