Former JD Lakshminarayana | మాజీ జేడీ ఇంటపెళ్లి సందడి.. జగన్‌కు సైతం కార్డ్ ఇస్తారా?

మాజీ జేడీగారి ఇంట పెళ్లి సందడి.. ప్రముఖులకు ఆహ్వానం విధాత‌: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Former JD Lakshminarayana) తన కుమార్తె ప్రియాంక పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు… అయన అటు రాజకీయాలు, సామాజిక కార్యక్రమాల్లో బిజీగా అంటూనే ఇటు కుమార్తెను ఓ ఇంటిదాన్ని చేస్తున్నారు. ఐతే ఈ విషయంలో పలు ఆసక్తికర సన్నివేశాలు జరుగుతున్నాయి. 2009 టైములో జగన్ ను అరెస్ట్ చేయడం.. ఆయన అవినీతి, అక్రమ ఆస్తుల కేసుల దర్యాప్తులో చాలా హుషారుగా […]

Former JD Lakshminarayana | మాజీ జేడీ ఇంటపెళ్లి సందడి.. జగన్‌కు సైతం కార్డ్ ఇస్తారా?
  • మాజీ జేడీగారి ఇంట పెళ్లి సందడి..
  • ప్రముఖులకు ఆహ్వానం

విధాత‌: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Former JD Lakshminarayana) తన కుమార్తె ప్రియాంక పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు… అయన అటు రాజకీయాలు, సామాజిక కార్యక్రమాల్లో బిజీగా అంటూనే ఇటు కుమార్తెను ఓ ఇంటిదాన్ని చేస్తున్నారు. ఐతే ఈ విషయంలో పలు ఆసక్తికర సన్నివేశాలు జరుగుతున్నాయి. 2009 టైములో జగన్ ను అరెస్ట్ చేయడం.. ఆయన అవినీతి, అక్రమ ఆస్తుల కేసుల దర్యాప్తులో చాలా హుషారుగా ఉన్న జేడీ లక్ష్మీనారాయణ అప్పట్లో గొప్ప పాపులారిటీ సంపాదించారు.

అవినీతిపరుల పాలిట సింహ స్వప్నం అన్నట్లుగా టిడిపి, దాని మద్దతుదారులు హైప్ క్రికెట్ చేసి, ఆయన చిత్రపటాలకు పాలతో అభిషేకం కూడా చేసారు. అవినీతిని దునుమాడే పరశురాముడిగా ఆయన్ను కీర్తించారు.. కెలజీల్లో, యువతకు స్ఫూర్తిని అందించే వ్యక్తిగా, వాళ్లకు వ్యక్తిత్వ వికాస పాఠాలు సైతం చెబుతూ వస్తున్న లక్ష్మీనారాయణ ఆ తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి విశాఖ నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆయన టేకప్ చేసిన జగన్ కేసులు చాలా వరకూ కోర్టుల్లో వీగిపోవడం,ఈలోపు జగన్ సీఎం అవ్వడం జరిగిపోయాయి.

ఇదిలా ఉండగా ఇప్పుడు జేడీ తన కుమార్తె ప్రియాంక పెళ్లి కార్డుల పంపిణీలో బిజిగా ఉన్నారు. మొన్న చిరంజీవిని కలిసి కార్డిచ్చిన జేడీ నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను సైతం కలిసి ఆహ్వానించారు. ఇక ఇప్పుడు డౌట్ ఏమంటే ఆయన జగన్ను సైతం కలుస్తారా.? పెళ్లి కార్డు ఇస్తారా.? అది సాధ్యమేనా..? జగన్ అపాయింట్మెంట్ ఇస్తారా.? సినీ, రాజకీయ వ్యాపార , పారిశ్రామికవేత్తలను కాలిస్తున్న జేడీ లక్ష్మీనారాయణ అదే క్రమంలో జగన్ ను కలుస్తారా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జేడీ కుమారుడు ఐపీఎస్ కు ఎంపికై ఇప్పుడు కర్ణాటకలో ఎస్పీ క్యాడర్లో ఉద్యోగంలో ఉన్నారు.