Gangavva | కట్టెల పొయ్యిమీద మిరపకాయ బజ్జీలు చేసి తెచ్చిన ఎట్లున్నయ్..? మీ ఆవిడ చేసినట్టున్నాయా? ఈ ముసల్ది చేసున్నట్టున్నాయా? అంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్‌రెడ్డిని గంగవ్వ సరదాగా ప్రశ్నించింది. దీనికి రేవంత్‌రెడ్డి బదులిస్తూ మా అమ్మ చేసినట్టున్నయ్ అంటూ హాథ్ సే హథ్ జోడో యాత్ర కొనసాగుతున్నది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డిని ‘మై విలేజ్ షో’తో సెలబ్రిటిగా మారిన గంగవ్వ కలిసింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సరదాగా సంభాషణ జరిగింది. […]
Gangavva | కట్టెల పొయ్యిమీద మిరపకాయ బజ్జీలు చేసి తెచ్చిన ఎట్లున్నయ్..? మీ ఆవిడ చేసినట్టున్నాయా? ఈ ముసల్ది చేసున్నట్టున్నాయా? అంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్‌రెడ్డిని గంగవ్వ సరదాగా ప్రశ్నించింది. దీనికి రేవంత్‌రెడ్డి బదులిస్తూ మా అమ్మ చేసినట్టున్నయ్ అంటూ హాథ్ సే హథ్ జోడో యాత్ర కొనసాగుతున్నది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డిని ‘మై విలేజ్ షో’తో సెలబ్రిటిగా మారిన గంగవ్వ కలిసింది.
ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సరదాగా సంభాషణ జరిగింది. తాను స్వయంగా చేసుకుని వచ్చిన మిరపకాయ బజ్జీలను ‘ఇంకొకటి తిను’ అంటూ ఆప్యాయంగా తినిపించింది. ‘ఏం రంది పెట్టుకోకు.. ఎండలు బాగున్నయ్.. జర ఎండ తక్కువ ఉన్నప్పుడు బయలెల్లు.. అంటూ రేవంత్‌కు జాగ్రత్తలు చెప్పింది. నీకు కుండ చికెన్ అంటే ఇష్టమా? నాటుకోడి అంటే ఇష్టమా? మన కోడి అంటే ఇష్టమా? అని అడుగుతూ ఇష్టాఇష్టాలను తెలుసుకునే ప్రయత్నిం చేసింది.
మా రేవంత్ రెడ్డిని చూడాలని ఇంత దూరం వచ్చిన.. మా ఇంటికి వచ్చి ఇల్లు చూస్తవని మాగ అనుకున్న. జగిత్యాల వస్తావట కదా. మరి మా ఇంటికి వస్తవా లేదా? అంటూ రేవంత్‌ను తన ఇంటికి ఆహ్వానించింది గంగవ్వ. దగ్గరైన, దూరమైన.. ఈ గుండెలో ప్రేముంటే.. ఎంత దూరమైనా వస్తవ్.. ప్రేమతో గంగవ్వ అంది. దాంతో స్పందించిన రేవంత్‌రెడ్డి జగిత్యాల పర్యటన రోజు తప్పక ఇంటికి వస్తానని హామీ ఇచ్చారు. ‘వీధుల్లో మంచిగ మాట్లాడుతావ్.. మరి నాతోనేంది.. మాట్లాడుతనే లేవు అంటూ ఛలోక్తి విసిరింది గంగవ్వ.
తిరుగు.. ఏం కాదు.. అన్ని దేవుళ్లు మనతోనే ఉన్నయ్ అంటూ రేవంత్‌కు ఆశీర్వచనం ఇచ్చింది గంగవ్వ. పాదయాత్రలో సీతక్కనే కాదు.. మనిషికింత బరువు మోయాల్సిందని సూచించింది. మందు తాగుడు ఎక్కువ. దావతులు ఎక్కువ అయితున్నయ్. ఇటు ఉన్న భాగోతం అటు.. అటున్న బాగోతం ఇటు. అని మద్యం వల్ల కలిగే పర్యవసానాలను గంగవ్వ వివరించే ప్రయత్నం చేయగా.. స్పందించిన రేవంత్ తన పర్యటనలో ఉప్పుగల్లు అనే గ్రామానికి వెళ్తే అక్కడ ఉన్న 12 వార్డుల్లో 24 బెల్ట్ షాపులు నడుస్తున్న విషయాన్ని గంగవ్వ దృష్టికి తెచ్చారు.
మహిళలు బెల్ట్ షాపులు మూసివేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. గంగవ్వ తన కుటుంబ పరిస్థితులు చెప్పే ప్రయత్నం చేయగా.. తనకు ఊరు, వ్యవసాయం, గ్రామీణ వాతావరణం అన్ని తెలుసునని గంగవ్వకు వివరించారు. అనేక ఏళ్లుగా గృహాల నిర్మాణం జరగకపోవడంతో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయన్నారు.
పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యల్ని తెలుసుకొనే అవకాశం లభించిందన్నారు. తనను ఆప్యాయంగా ఇష్టమైన మిర్చీ బజ్జీలను తెచ్చి.. చూపించిన ప్రేమకు నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చిందంటూ రేవంత్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పాద‘యాత్ర’లో జనం కష్టాలు, బాధలు నేరుగా చూస్తున్నా. నా అనుభవాలను నా తల్లితో ఇలాగే పంచుకునేవాడిని. తల్లిని గుర్తు చేసిన గంగవ్వను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని రేవంత్‌రెడ్డి అన్నారు.