Rahul Gandhi | రాహుల్‌కు పెళ్లి చేద్దామా..? సోనియా ఏమ‌న్నారో తెలుసా..?

Rahul Gandhi విధాత‌: కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు రాహుల్ గాంధీ.. పెళ్లి ప్ర‌స్తావ‌న మ‌రోసారి చ‌ర్చానీయాంశ‌మైంది. ఇటీవ‌లే సోనియాను క‌లిసిన హ‌ర్యానా మ‌హిళ ఒక‌రు.. రాహుల్ పెళ్లి విష‌యంపై సోనియాతో ప్ర‌స్తావించారు. ఆ సంభాష‌ణ‌కు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఆ వీడియో వైర‌ల్ అవుతోంది. హ‌ర్యానా సోనిప‌ట్ జిల్లాలోని మ‌దీనా గ్రామంలో ఈ ఏడాది జులై 8వ తేదీన రాహుల్ గాంధీ ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీకి త‌ప్ప‌కుండా పిలుస్తాన‌ని, […]

  • By: krs    latest    Jul 29, 2023 1:42 AM IST
Rahul Gandhi | రాహుల్‌కు పెళ్లి చేద్దామా..? సోనియా ఏమ‌న్నారో తెలుసా..?

Rahul Gandhi

విధాత‌: కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు రాహుల్ గాంధీ.. పెళ్లి ప్ర‌స్తావ‌న మ‌రోసారి చ‌ర్చానీయాంశ‌మైంది. ఇటీవ‌లే సోనియాను క‌లిసిన హ‌ర్యానా మ‌హిళ ఒక‌రు.. రాహుల్ పెళ్లి విష‌యంపై సోనియాతో ప్ర‌స్తావించారు. ఆ సంభాష‌ణ‌కు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఆ వీడియో వైర‌ల్ అవుతోంది.

హ‌ర్యానా సోనిప‌ట్ జిల్లాలోని మ‌దీనా గ్రామంలో ఈ ఏడాది జులై 8వ తేదీన రాహుల్ గాంధీ ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీకి త‌ప్ప‌కుండా పిలుస్తాన‌ని, మంచి అథిత్యం ఏర్పాటు చేస్తాన‌ని కొంత మంది మ‌హిళ‌ల‌కు రాహుల్ హామీ ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఆ మ‌హిళ‌ల‌ను రాహుల్ ఢిల్లీకి పిలిపించారు. ఢిల్లీని చూపించిన అనంత‌రం 10 జ‌న్‌ప‌థ్‌లోని సోనియా నివాసానికి వారిని తీసుకెళ్లి, లంచ్ ఏర్పాటు చేశారు.
ఈ సంద‌ర్భంగా ఓ మ‌హిళ సోనియాతో మాట్లాడుతూ.. రాహుల్ పెళ్లి విష‌యంపై ప్ర‌స్తావించారు. రాహుల్‌కు పెళ్లి చేద్దామా? అని అడిగేస‌రికి, స‌రిపోయే అమ్మాయిని మీరే చూడాల‌ని సోనియా న‌వ్వుతూ ఆమెకు బ‌దులిచ్చారు. రాహుల్ కూడా న‌వ్వుతూ అవుతుంది.. అవుతుంది అని అన్నారు. దీంతో అక్క‌డ న‌వ్వులు విర‌బూశాయి.

అంత‌కు ముందు హ‌ర్యానా మ‌హిళ‌లు రాజీవ్ మ‌ర‌ణం గురించి గుర్తు చేయ‌గా, సోనియా ఒకింత భావోద్వేగానికి లోన‌య్యారు. ఆ స‌మ‌యంలో అమ్మ కొన్ని రోజుల పాటు అన్నం, నీళ్లు ముట్ట‌లేద‌ని ప్రియాంక గాంధీ చెప్పారు. అనంత‌రం సోనియా, ప్రియాంక క‌లిసి మహిళ రైతుల‌తో క‌లిసి నృత్యం చేశారు.

హ‌ర్యానా మహిళా రైతుల‌తో క‌లిసి ముచ్చటించిన వీడియోను రాహుల్ విడుద‌ల చేశారు. నాకు, అమ్మ‌కు, ప్రియాంకు ఇదొక గుర్తుండిపోయే రోజు. ప్ర‌త్యేక అతిథుల‌తో మ‌చ్చ‌టించ‌డం సంతోషంగా ఉంది. మా కోసం సోనిప‌ట్ మ‌హిళా రైతులు.. చాలా బ‌హుమ‌తులు తీసుకొచ్చారు. దేశీ నెయ్యి, స్వీట్ ల‌స్సీ, ప‌చ్చ‌ళ్లతో పాటు వారి ప్రేమ‌ను త‌మ కుటుంబానికి పంచార‌ని రాహుల్ క్యాప్ష‌న్ ఇచ్చారు.