Lovers | ప్రియురాలిని కాదని మరో మహిళతో.. వేడినూనెతో ప్రియుడిపై దాడి
Lovers | వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దీంతో రెండేండ్ల నుంచి ఇద్దరు కలిసి సహజీవనం( Dating )లో ఉన్నారు. ప్రియుడు( Lover )మాత్రం తన ప్రియురాలి కళ్లుగప్పి మరో మహిళతో తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకుందాం అని ప్రియురాలు అడగడంతో అతను సమాధానం చాటేస్తున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన ప్రియురాలు.. తన ప్రియుడిపై వేడి నూనెతో దాడి చేసింది. ఈ ఘటన తమిళనాడు( Tamil Nadu ) రాజధాని చెన్నై( Chennai )లోని ఈరోడ్‌లో వెలుగు […]

Lovers | వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దీంతో రెండేండ్ల నుంచి ఇద్దరు కలిసి సహజీవనం( Dating )లో ఉన్నారు. ప్రియుడు( Lover )మాత్రం తన ప్రియురాలి కళ్లుగప్పి మరో మహిళతో తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకుందాం అని ప్రియురాలు అడగడంతో అతను సమాధానం చాటేస్తున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన ప్రియురాలు.. తన ప్రియుడిపై వేడి నూనెతో దాడి చేసింది. ఈ ఘటన తమిళనాడు( Tamil Nadu ) రాజధాని చెన్నై( Chennai )లోని ఈరోడ్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఈరోడ్‌కు చెందిన మీనాదేవి( Meena Devi ), కార్తీ( Karthi )గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో పెళ్లికి ముందే వారు సహజీవనంలో ఉన్నారు. అయితే పెళ్లి చేసుకుందామని ప్రియురాలు అడిగినప్పుడల్లా కార్తీ సమాధానం దాట వేస్తున్నాడు. మరో మహిళతో కార్తీ తిరుగుతున్నట్లు మీనాదేవీ గుర్తించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు చోటు చేసుకున్నాయి.
తాను మోసపోయానని గ్రహించిన మీనాదేవి.. మాట్లాడుకుందామని చెప్పి తన గదికి పిలిపించింది. అక్కడ కార్తీపై వేడి నూనెతో దాడి చేసింది. ఇక నిన్ను ఎవరు ప్రేమిస్తారో చూస్తా అని గట్టిగా మీనా కేకలు వేసింది.
నూనెతో దాడి చేయడంతో కార్తీ ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కార్తీ అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.