Gold Rates: మళ్లీ తగ్గిన బంగారం.. హైదరాబాద్ ఎంతంటే?
బంగారం ధరలు మరోసారి తగ్గాయి. నూతన ఆర్థిక సంవత్సరం తొలి రోజు ఏప్రిల్ 1న రూ.94వేల ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరిన బంగారం ధరలు వారం రోజుల్లోనే రూ.3000 తగ్గాయి.

Gold Rates: బంగారం ధరలు మరోసారి తగ్గాయి. నూతన ఆర్థిక సంవత్సరం తొలి రోజు ఏప్రిల్ 1న రూ.94వేల ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరిన బంగారం ధరలు వారం రోజుల్లోనే రూ.3000 తగ్గాయి.
శనివారం హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల బంగారం ధర రూ.900తగ్గి రూ.83,100కు తగ్గింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.980తగ్గి రూ.90.600గా ఉంది. చైన్నెలో, బెంగుళూరులోనూ అదే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22క్యారెట్లకు రూ.83,250, 24క్యారెట్లకు రూ.90,810గా ఉంది.
దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.78,909, 24క్యారెట్లకు రూ.85,252, అమెరికాలో 22క్యారెట్లకు రూ.79,086, 24క్యారెట్లకు రూ.84,003గా ఉంది.
ఇక వెండి ధరలు సైతం మరోసారి తగ్గాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ.5000తగ్గింది. కిలో రూ.1,03,000వద్ధ కొనసాగుతోంది. గత ఐదు రోజుల్లో వెండి రూ.12,000తగ్గింది.