Gold Rates | మగువలకు షాక్‌ ఇచ్చిన బంగారం..! ఒకే రోజు భారీగా ధర..! తులం రేటు ఎంత ఉందంటే..?

Gold Rates | మహిళలకు బంగారం ధరలు షాక్‌ ఇచ్చాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు శనివారం మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ.55,100కి చేరింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.440 వరకు పెరిగి రూ.60,110కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 55,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,260కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్​రూ.60,110కి […]

Gold Rates | మగువలకు షాక్‌ ఇచ్చిన బంగారం..! ఒకే రోజు భారీగా ధర..! తులం రేటు ఎంత ఉందంటే..?

Gold Rates | మహిళలకు బంగారం ధరలు షాక్‌ ఇచ్చాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు శనివారం మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ.55,100కి చేరింది.

24 క్యారెట్ల బంగారంపై రూ.440 వరకు పెరిగి రూ.60,110కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 55,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,260కి చేరింది.

ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్​రూ.60,110కి పెరిగింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,420 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.60,460 చేరింది.

బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,160 వద్ద కొనసాగుతున్నది.

హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,110 పలుకున్నది. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరో వైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి రూ.73,100 పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,500 వద్ద కొనసాగుతున్నది.