Gold Rate Hike | గోల్డ్ మరింత పైపైకి..! దిగివచ్చిన వెండి..! నేడు హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Rate Hike | అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నది. అమెరికాలో వడ్డీ రేట్ల పెరగవనే అంచనాలతో బంగారానికి డిమాండ్ కొనసాగుతున్నది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం పడుతున్నది. ఈ క్రమంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధర వరుసగా రెండోరోజు పెరిగింది. 22 క్యారెట్ల పుత్తడిపై రూ.150 పెరిగి తులానికి రూ.55,050 పలుకుతున్నది. మరో వైపు 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.170 పెరిగి.. రూ.60,050 వద్ద ట్రేడవుతున్నది. మరో వైపు వరుసగా […]
Gold Rate Hike |
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నది. అమెరికాలో వడ్డీ రేట్ల పెరగవనే అంచనాలతో బంగారానికి డిమాండ్ కొనసాగుతున్నది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం పడుతున్నది. ఈ క్రమంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధర వరుసగా రెండోరోజు పెరిగింది. 22 క్యారెట్ల పుత్తడిపై రూ.150 పెరిగి తులానికి రూ.55,050 పలుకుతున్నది.
మరో వైపు 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.170 పెరిగి.. రూ.60,050 వద్ద ట్రేడవుతున్నది. మరో వైపు వరుసగా రెండో రోజు వెండి ధర తగ్గింది. కిలోకు రూ.200 తగ్గి.. రూ.77,100 పలుకుతున్నది.
దేశంలో వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే ఢిలీల్లో 22 క్యారెట్ల బంగారం రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,370 పెరిగింది.
చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,490కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,220కి చేరింది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,220కి పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.55,200 పలుకుతున్నది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.60,220కి పెరిగింది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి కిలోకు రూ.200 తగ్గి.. రూ.80వేలకు దిగివచ్చింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ప్లాటినం తులానికి రూ.240 తగ్గి.. రూ.25,550 వద్ద కొనసాగుతున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram