Gold Rates | బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ధర భారీగా తగ్గింది త్వరపడండి..!

Gold Rates | బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పుత్తడి ధరలు భారీగా పెరగుతూ స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే, బులియన్‌ మార్కెట్‌లో గురువారం బంగారం రేటు భారీగానే తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.300 పతనమైంది. ప్రస్తుతం తులానికి రూ.55,100 పలుకుతున్నది. ఇక 24 క్యారెట్ల పుత్తడిపై రూ.330 తగ్గి.. తులానికి రూ.60,100కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం 55,250 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,260కి దిగివచ్చింది. చెన్నైలో […]

Gold Rates | బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ధర భారీగా తగ్గింది త్వరపడండి..!

Gold Rates | బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పుత్తడి ధరలు భారీగా పెరగుతూ స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే, బులియన్‌ మార్కెట్‌లో గురువారం బంగారం రేటు భారీగానే తగ్గింది.

22 క్యారెట్ల తులం బంగారంపై రూ.300 పతనమైంది. ప్రస్తుతం తులానికి రూ.55,100 పలుకుతున్నది. ఇక 24 క్యారెట్ల పుత్తడిపై రూ.330 తగ్గి.. తులానికి రూ.60,100కి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం 55,250 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,260కి దిగివచ్చింది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.55,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,550 ఉన్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం పసిడి రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,110 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. వెండి ధరలు సైతం భారీగానే తగ్గుముఖం పట్టింది. కిలోకు రూ.700 తగ్గి.. రూ.77,300 వద్ద కొనసాగుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80,300 వద్ద ట్రేడవుతున్నది.