Gold Rates | హమ్మయ్య బంగారం ధర తగ్గింది..! హైదరాబాద్‌లో తులం ఎంత పలుకుతుందంటే..?

Gold Rates | కొనుగోలుదారులకు బంగారం ధరలు స్వల్పంగా ఊరటనిచ్చాయి. ఇటీవల పెరుగుతూ వచ్చిన పుత్తడి ధరలు దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.150 తగ్గి.. తులానికి రూ.55,150 పలుకుతున్నది. మరో వైపు 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.160 తగ్గి రూ.60,160కి దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,330కి తగ్గింది. ముంబయి, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల […]

  • By: Vineela |    latest |    Published on : Sep 06, 2023 6:36 AM IST
Gold Rates | హమ్మయ్య బంగారం ధర తగ్గింది..! హైదరాబాద్‌లో తులం ఎంత పలుకుతుందంటే..?

Gold Rates |

కొనుగోలుదారులకు బంగారం ధరలు స్వల్పంగా ఊరటనిచ్చాయి. ఇటీవల పెరుగుతూ వచ్చిన పుత్తడి ధరలు దిగివచ్చాయి.

22 క్యారెట్ల బంగారంపై రూ.150 తగ్గి.. తులానికి రూ.55,150 పలుకుతున్నది. మరో వైపు 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.160 తగ్గి రూ.60,160కి దిగివచ్చింది.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,330కి తగ్గింది.

ముంబయి, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల పసిడి రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్​ రూ.60,160 వద్ద ట్రేడవుతున్నది. చెన్నైలో 22 స్వర్ణం రూ.55,450 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.60,490 వద్ద కొనసాగుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,160 వద్ద పలుకుతున్నది.

ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే బుధవారం స్థిరంగా కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో కిలోకు రూ.79 వేలు పలుకుతున్నది.