Gold Rates | బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మొన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. నిన్న నిలకడగా కొనసాగాయి. మళ్లీ మంగళవారం బులియన్‌ మార్కెట్‌లు ధరలు పెరిగాయి. పెరుగుతున్న ధరలతో సామాన్యులు బంగారం అంటే బాబోయ్‌ అనే పరిస్థితులు వస్తున్నాయి. 22 క్యారెట్ల పసిడి రూ.100 పెరిగి తులం రూ.57,400 పలుకుతున్నది. 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.110 పెరగడంతో తులానికి రూ.62,620కి పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.57,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడిరూ.62,770 పలుకుతున్నది.


ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.62,620కి చేరింది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,110కి ఎగిసింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.62,620 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలను పరిశీలిస్తే.. స్వల్పంగా పెరిగింది. రూ.300 పెరగడంతో కిలో వెండి ధర రూ.75వేలకు చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80వేల వద్ద కొనసాగుతున్నది.