GST | మూడొంతుల పన్ను పేదలు కట్టిందే: ఆక్స్‌ఫామ్
GST విధాత: భారతదేశంలోని 50 శాతం మంది పేదలు మూడింట రెండొంతుల జీఎస్‌టీ చెల్లిస్తున్నారని ఆక్స్‌ఫామ్ ప్రకటించింది. అదే సమయంలో దేశంలోని పదిశాతం మంది సంపన్నులు చెల్లిస్తున్న జీఎస్‌టీ 3-4 శాతం మాత్రమేనని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. 2022-23 లో 18 లక్షలకోట్లు పరోక్షపన్నుల ఆదాయం ఉండవచ్చునని అంచనావేశారని, అందులో పేదలు చెల్లించేదే అధికమని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. భారత దేశంలో పెరుగుతున్న అసమానతలను తగ్గించాలంటే అతి సంపన్నులపై ఆదాయపు పన్ను 70 శాతం వరకు విధించాలని, సంపద […]
GST
విధాత: భారతదేశంలోని 50 శాతం మంది పేదలు మూడింట రెండొంతుల జీఎస్‌టీ చెల్లిస్తున్నారని ఆక్స్‌ఫామ్ ప్రకటించింది. అదే సమయంలో దేశంలోని పదిశాతం మంది సంపన్నులు చెల్లిస్తున్న జీఎస్‌టీ 3-4 శాతం మాత్రమేనని ఆక్స్‌ఫామ్ పేర్కొంది.
2022-23 లో 18 లక్షలకోట్లు పరోక్షపన్నుల ఆదాయం ఉండవచ్చునని అంచనావేశారని, అందులో పేదలు చెల్లించేదే అధికమని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది.
భారత దేశంలో పెరుగుతున్న అసమానతలను తగ్గించాలంటే అతి సంపన్నులపై ఆదాయపు పన్ను 70 శాతం వరకు విధించాలని, సంపద పన్ను మూడు నుంచి నాలుగు శాతం విధించాలని నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త జోసెఫ్ స్టిలిజ్ సూచించినట్టు ఒక వార్తా కథనం వెల్లడించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram