Ileana | పెళ్లి కాకుండానే.. ఇలియానాను ప్రెగ్నెంట్ చేసింది ఇతనే!
Ileana విధాత: పెళ్ళి వరకూ పోకుండా కెరియర్ కాస్త డల్ అవుతుందనే సమయానికి ఎవరో ఒకరితో ప్రేమాయణం అటూ మొదలు పెట్టి నెమ్మదిగా డేటింగ్ ఆపైన బ్రేకప్ అయ్యి మరొకరితో లివింగ్ రిలేషన్ షిప్‌లోకి దిగడం.. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. తారల తలరాతల నిండా ఇదే తంతు. సడెన్‌గా వాళ్ళు ఎవరితో ప్రేమంటూ ప్రకటిస్తారో అస్సలు ఊహించలేకుండా ఉన్నాం. ఇటు తెలుగులో అటు హిందీలో మెరిసి, కొంతకాలం నిలిచి, మాయమైన ఇలియానా నటన పరంగా అగ్ర […]

Ileana
విధాత: పెళ్ళి వరకూ పోకుండా కెరియర్ కాస్త డల్ అవుతుందనే సమయానికి ఎవరో ఒకరితో ప్రేమాయణం అటూ మొదలు పెట్టి నెమ్మదిగా డేటింగ్ ఆపైన బ్రేకప్ అయ్యి మరొకరితో లివింగ్ రిలేషన్ షిప్‌లోకి దిగడం.. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. తారల తలరాతల నిండా ఇదే తంతు. సడెన్‌గా వాళ్ళు ఎవరితో ప్రేమంటూ ప్రకటిస్తారో అస్సలు ఊహించలేకుండా ఉన్నాం. ఇటు తెలుగులో అటు హిందీలో మెరిసి, కొంతకాలం నిలిచి, మాయమైన ఇలియానా నటన పరంగా అగ్ర స్థానాన్నే అందుకున్నా.. కెరియర్‌ని పెళ్ళి పీటలు ఎక్కించడంలో కాస్త వెనకబడిందనే చెప్పాలి.
పెళ్ళంటే పెద్దగా ఆసక్తి లేకనో, లేక పెళ్ళి అవసరమా? అని అనుకుందో తెలియదు కానీ.. వ్యక్తిగత జీవితాన్ని కాస్త భిన్నంగా మొదలుపెట్టింది ఇలియానా. ఈమధ్యనే తన బేబీ బంప్ చూపిస్తూ ఉన్న ఫోటో పోస్ట్ చేసి చెప్పకనే చెబుతూ నేను తల్లినయ్యానని ప్రకటించింది. ఇంత పని చేసిన వాడు ఎవరా? అని ఇలియానా కొత్త ప్రియుణ్ణి కనిపెట్టే పనిలో నెట్టింట చాలా సోదాలే జరిగినా ఫలితం లేకపోయింది. అతనెవరనే విషయంలో పెద్దగా సమాచారం లేకపోయింది. ఎందుకంటే.. అప్పటికే ఇద్దరు, ముగ్గురితో అమ్మడు బ్రేకప్ అయింది మరి.
తాజా విషయానికి వస్తే.. పెళ్ళికాకుండానే తల్లవుతున్న ఇలియానా ఇంట్లో.. తన పెట్ డాగ్‌తో ఆటలాడుకుంటున్న ప్రియుడి ఫోటో ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో పెట్టి మరీ హైప్ పెంచేసింది ఇలియానా.. ఇక ఆగుతారా మన జనం. అతను ఇలియానా సహజీవనం చేస్తున్న మనిషేననేలా రచ్చ మొదలైంది. అతని ముఖాన్ని కనిపించకుండా ఫోటో తీసి పెట్టి సస్పెన్స్‌లో పెట్టే సరికి ఎవరికి నచ్చిన ముఖాన్ని వాళ్ళు తగిలించేసుకుంటున్నారు.
ఆ ఫోటోను చూస్తూ అది సెబాస్టియన్ అని అతగాడు హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్ అని చెప్పుకొస్తున్నారు. ఇందుకు ఓ పాయింట్‌ని కూడా రెడీ చేసుకున్నారు. ఆ మధ్య సెబాస్టియన్, కత్రినా, విక్కీ కౌశల్ ట్రిప్‌లో ఇలియానా కూడా కలిసి వెళ్ళిందని అతగాడే ఆమె ప్రియుడని ఖరారు చేసి వార్తలు రాసేసుకుంటున్నారు.
సెబాస్టియన్ ఇలియానాల మధ్య ఏదో ఉందనే వార్తలైతే జోరుగా సాగాయి కానీ దానికి ఇలియానా స్పందించలేదు. గతంలోనూ ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్‌తో ప్రేమలో పడి కొన్నేళ్ళు ప్రయాణం సాగించి, ఇద్దరూ చెరోదారి అయ్యారు. ఇక డిప్రెషన్‌లో పడి అందులోంచి కోలుకోవడానికి ఇలియానాకు చాలాకాలం పట్టిందట. ఈ సినీ జనాల జీవితాలు ఎప్పుడు ఎటు టర్న్ తీసుకుంటాయో చెప్పడం కష్టం. మొత్తంగా చూస్తే మాత్రం.. ఓ బిడ్డకు తల్లి అయ్యాక.. ఓ ఇంటికి ఇల్లాలవుతుందేమో ఈ ఇల్లీ బేబీ. చూద్దాం ఏం జరుగుతుందో.?