UPPAL: టికెట్ల కోసం ఎగబడ్డ జనం.. తొక్కిసలాట.. ఒకరి పరిస్థితి విషమం
హెచ్‌సీఏ బాధ్యతా రాహిత్యం విధాత: ఈ ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం టికెట్ల అమ్మకంలో హెచ్‌సిఏ నిర్వాకం ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులతో సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉప్పల్ స్టేడియం మొత్తం స్టేడియం సిటింగ్ కెపాసిటీ 60 వేలు కావడంతో 2 వారాల క్రితమే మొత్తం టికెట్లను నిర్వాహకులు అమ్మేశారు. టికెట్ల అమ్మకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని క్రికెట్ అభిమానులు (Cricket Fans) ఆందోళన వ్యక్తం […]

హెచ్‌సీఏ బాధ్యతా రాహిత్యం
విధాత: ఈ ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం టికెట్ల అమ్మకంలో హెచ్‌సిఏ నిర్వాకం ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులతో సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉప్పల్ స్టేడియం మొత్తం స్టేడియం సిటింగ్ కెపాసిటీ 60 వేలు కావడంతో 2 వారాల క్రితమే మొత్తం టికెట్లను నిర్వాహకులు అమ్మేశారు.
టికెట్ల అమ్మకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని క్రికెట్ అభిమానులు (Cricket Fans) ఆందోళన వ్యక్తం చేయడంతో రెండు రోజులుగా జింఖానా గ్రౌండ్ వద్ద మరోసారి టికెట్ల విక్రయం కౌంటర్లు తెరుస్తామన్నారు. దీంతో పెద్ద ఎత్తున క్రికెట్ ఫ్యాన్స్ అక్కడ పడిగాపులు పడుతున్నారు. బుధవారం రోజంతా నిరీక్షించారు.
కానీ గురువారం ఉదయం 10 గంటలకు కౌంటర్లు తెరిచారు. 2 గంటలు అయినా వంద టికెట్లు కూడా జారీ చేయక పోవడంతో అర్ధరాత్రే నుంచే క్యూలో ఉన్న వారిలో ఒక్కసారిగా అసహనం పెరిగిపోయింది. టికెట్ల కోసం ఎగబడడంతో తొక్కిసిలాట జరిగింది.
పోలీసులు జోక్యం చేసుకున్నా కూడా పరిస్థితి అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది.ఈ తొక్కిసలాటలో ఓ మహిళ స్పృహ తప్పిపడిపోయింది. ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.
హైదరాబాద్ క్రికెట్ సంఘం బాధ్యతరాహిత్యం కారణంగా భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్ల విక్రయ వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఈనెల 15వ తేదీన ‘పేటీఎం ఇన్‌సైడర్’ యాప్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి బుధవారం నుంచి సికింద్రాబాద్ జింఖానా మైదానంలో బార్‌కోడ్ టిక్కెట్లు ఇస్తామని మొబైల్‌కు, ఈ-మెయిల్స్‌కు సమాచారం వచ్చింది.
దీంతో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారంతా జింఖానాకు పోటెత్తారు. అయితే, టిక్కెట్ల ముద్రణ ఇంకా పూర్తి కాకపోవడం, ఆ విషయాన్ని టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి తెలియజేయక పోవడంతో తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అభిమానులు కూడా నగరానికి చేరుకున్నారు.
ఉదయం 10 గంటల నుంచే టిక్కెట్లు ఇస్తామని చెప్పి, 12 గంటలకు కూడా కౌంటర్లు తెరవక పోవడంతో అభిమానులు గేట్లు, గోడలు దూకి ఆఫీసు కార్యాలయంలోకి, పైకి, మైదానంలోకి దూసుకెళ్లారు. ఇంత మంది వస్తారని ఊహించని పోలీసులు కూడా అభిమానులను కట్టడి చేయడంతో విఫలమయ్యారు.
ఇక, టిక్కెట్లు బుక్ చేసుకున్న వారే కాక, రెండో దశ టిక్కెట్లను కౌంటర్లలో విక్రయిస్తున్నారంటూ వచ్చిన వార్తలను నమ్మి కూడా అభిమానులు తండోపతండాలుగా అక్కడికి చేరుకోవడంతో ఒక దశలో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసుల రంగప్రవేశంతో కొద్ది సేపటికి పరిస్థితి అదుపులోకి వచ్చింది.
నిజానికి టికెట్స్ ఎప్పుడో అయిపోయాయన్న విషయం తెలియక అక్కడికి వేలాది మంది క్రికెట్ అభిమానులు చేరుకున్నారు. అసలు ఎన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయన్న విషయం సైతం నిర్వాహకులు బయటకు చెప్పడం లేదు. హైదరాబాద్, రాచకొండ పోలీసులకు మ్యాచ్ తలనొప్పిగా మారింది.
అయితే జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయినట్టు వచ్చిన వార్తని పోలీసులు ఖండించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు స్పష్టం చేశారు.