Site icon vidhaatha

Phone tapping case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

విధాత, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్‌పై పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు న్యాయవాది సురేశ్ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ విచారణ చేపడితే కేసులో ఉన్న రాజకీయ నాయకులు బయటకు వస్తారని ఫిర్యాదులో తెలిపారు.

కేసులో నిందితులు వ్యాపారులను బెదిరించి కోట్లు వసూలు చేశారని, పోలీస్ వాహనాల్లో ఓ పార్టీకి సంబంధించిన డబ్బులు తరలించినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఫిర్యాదులో న్యాయవాది సురేశ్ పేర్కోన్నారు.ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నిందితులను విచారించి పలు కీలక వివరాలు సేకరించారు.

కాగా.. నిందితులు చేసిన అక్రమాలు, బలవంతపు వసూళ్లు, ప్రతిపక్ష నాయకుల, జర్నలిస్టుల, సెలబ్రిటీలకు సంబంధించిన ఫోన్ల ట్యాపింగ్ వివరాలను రాబట్టారు. ఈడీకి అందిన ఫిర్యాదుతో ఆ సంస్థ రంగంలోకి దిగిన పక్షంలో ఈ కేసు మరింత లోతుగా సమగ్రంగా విచారణ జరిగే అవకాశముందని భావిస్తున్నారు.

Exit mobile version