High Court | మంత్రి కొప్పులకు హైకోర్టులో షాక్..
High Court తుది వాదనలు వినాల్సిందేనని తేల్చిచెప్పిన ఉన్నత ధర్మాసనం మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్, విధాత: బీఆర్ఎస్ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టులో షాక్ తగిలింది. తన ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి, జగిత్యాల డీసీసీ ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ దాఖలు చేసిన (ఐఏ) మధ్యంతర పిటిషన్‌ను మంగళవారం ఉన్నత ధర్మాసనం కొట్టివేసింది. మూడెండ్ల పాటు ఈ కేసులో విచారణ జరిగిన […]

High Court
- తుది వాదనలు వినాల్సిందేనని తేల్చిచెప్పిన ఉన్నత ధర్మాసనం
- మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్, విధాత: బీఆర్ఎస్ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టులో షాక్ తగిలింది. తన ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి, జగిత్యాల డీసీసీ ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ దాఖలు చేసిన (ఐఏ) మధ్యంతర పిటిషన్‌ను మంగళవారం ఉన్నత ధర్మాసనం కొట్టివేసింది.
మూడెండ్ల పాటు ఈ కేసులో విచారణ జరిగిన తర్వాత, అడ్వకేట్ జనరల్ కమిషన్‌ను నియమించి అక్కడ కూడా వాదనలు ముగిశాక పిటిషన్ ను మధ్యలో ఎలా కొట్టివేస్తారని ప్రశ్నించింది. తుది వాదనలు పూర్తిగా వినాల్సిందేనని సూచించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్ టీఆర్ఎస్ అభ్యర్థిగి బరిలో దిగారు. ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అడ్లూరి లక్ష్మణకుమార్ ఉన్నారు.
అయితే ఈ ఎన్నికలో 441 ఓట్ల మెజార్టీతో కొప్పుల గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన ప్రత్యర్థి అడ్లూరి కొప్పుల ఎన్నికపై తనకు అనుమానాలు ఉన్నాయని, ఓట్ల లెక్కింపు సరిగ్గా జరుపలేరని కొప్పుల ఎన్నిక సరైందికాదని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఓటమి భయంతోనే కొప్పుల ఈశ్వర్ అడ్డదారులు తొక్కారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అధికారుల అండ చూసుకొని తప్పుడు మార్గంలో ఆయన ఎన్నికలో విజేతగా నిలిచారని తెలిపారు. వీవీ ప్యాట్ల ద్వారా వచ్చిన ఓట్లను లెక్కించక ముందే అధికారులు కొప్పుల పేరు ప్రకటించారని అడ్లూరి పేర్కొన్నారు. దీంతో విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటింగ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను, సీసీ ఫుటేజీని అందించాలని అధికారులు ఆదేశించింది.
అయితే దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ఉన్నత ధర్మాసనం కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో తదుపరి విచారణలో ఎలాంటి తీర్పు వస్తుందోనని వేచి చూడాల్సిందే.