Honey Rose | బాల‌య్య బ్యూటీ.. హనీరోజ్‌కి అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా..!

Honey Rose | కొంద‌రికి వంద‌ల సినిమాలు చేసిన అనుకున్నంత క్రేజ్ రాదు. పాపుల‌రాటీ కోసం కుస్తులు ప‌డుతూనే ఉంటారు. అయితే మ‌రి కొంద‌రు మాత్రం ఒక్క సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారుతుంటారు. అలా వీర‌సింహారెడ్డి అనే సినిమాతో ఒక్క‌సారిగా తెలుగు ప్రేక్ష‌కుల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న అందాల భామ హ‌నీరోజ్. కేర‌ళ‌లో జ‌న్మించిన హ‌నీ రోజ్‌.. 14 ఏళ్ల వయస్సులోనే `బాయ్ ఫ్రెండ్` అనే చిత్రంతో త‌న సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ […]

  • Publish Date - August 13, 2023 / 02:00 AM IST

Honey Rose |

కొంద‌రికి వంద‌ల సినిమాలు చేసిన అనుకున్నంత క్రేజ్ రాదు. పాపుల‌రాటీ కోసం కుస్తులు ప‌డుతూనే ఉంటారు. అయితే మ‌రి కొంద‌రు మాత్రం ఒక్క సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారుతుంటారు. అలా వీర‌సింహారెడ్డి అనే సినిమాతో ఒక్క‌సారిగా తెలుగు ప్రేక్ష‌కుల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న అందాల భామ హ‌నీరోజ్.

కేర‌ళ‌లో జ‌న్మించిన హ‌నీ రోజ్‌.. 14 ఏళ్ల వయస్సులోనే ‘బాయ్ ఫ్రెండ్’ అనే చిత్రంతో త‌న సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత త‌మిళంలో ప‌లు సినిమాలు చేసింది. ఇక‌ ముత్యాల సుబ్బ‌య్య 50వ చిత్రం ఆల‌యం మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన హనీరోజ్.. ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసింది. కాని ఏవి కూడా ఈ అమ్మ‌డికి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి.

బాల‌కృష్ణ‌, గోపీచంద్ మ‌లినేని కాంబోలో తెర‌కెక్కిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రంతో హ‌నీ రోజ్ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వ‌గా, ఇందులో ఆమె రెండు పాత్ర‌లు పోషించి భారీ క్రేజ్ ద‌క్కించుకుంది. ఆమె అందంతో పాటు న‌ట‌న‌కు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు. అస‌లు హనీ రోజ్ కు ఇంత రెస్పాన్స్ వస్తుందని టీమ్ కూడా అనుకుందో లేదో తెలియదు కానీ ఈ ముద్ద‌గుమ్మ మాత్రం ఒక్క సినిమాతో గట్టిగా అంద‌రికి ఎక్కేసింది.

ఇక సోష‌ల్ మీడియాలో కూడా హనీ రోజ్ ర‌చ్చ పీక్స్ లో ఉంది. అయితే హనీరోజ్ ను చూసిన ఆడియన్స్ అప్సరస మున‌ముందు క‌ద‌లాడుతుందా అని అనుకున్నారు. వీర‌సింహారెడ్డి త‌ర్వాత టాలీవుడ్ లో ఈ అమ్మ‌డికి డిమాండ్ పెరుగుతుంది అని అంద‌రు కలలు కన్నారు. కానీ కుర్రాళ్ల ఆశ‌లు అన్నీ గ‌ల్లంత‌య్యాయి. ఈ భామ పెద్ద‌గా అవ‌కాశాలు అందిపుచ్చుకోలేకోపోతుంది.

అయితే హనీరోజ్ దాదాపు రెండు ద‌శాబ్దాల నుంచి ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతుండ‌గా, ఈ భామ ఆస్తుల‌ని బాగానే కూడపెట్టింద‌ని అంటున్నారు. త‌ను చేసే ప్ర‌తి సినిమాకి కోటి రూపాయ‌ల వ‌ర‌కు రెమ్యున‌రేషన్‌ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుండ‌గా, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కు రిబ్బ‌న్ క‌ట్ చేస్తే.. రూ. 60 ల‌క్ష‌లు పైగా ఆమెకి అందిస్తార‌ట‌.

వాటితో పాటు ప‌లు బ్రాండ్స్ ను కూడా ప్ర‌మోట్ చేస్తూ తన అకౌంట్ ఫుల్ అయ్యేలా ముందుకు సాగుతుంద‌ట‌. హ‌నీరోజ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 20 కోట్ల రేంజ్ లో ఉంటుంద‌ని, కేర‌ళ‌లోనే ఈ అమ్మ‌డి ఆస్తులు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని స‌మాచారం.

Latest News