రెండో భర్తతో రాసలీలలు.. మూడో భర్త చేతిలో భార్య హతం
Wife Murder | రెండో భర్తతో రాసలీలల్లో మునిగి తేలుతూ అడ్డంగా బుక్కైన భార్య.. మూడో భర్త చేతిలో హతమైంది. ఈ దారుణ ఘటన ఘజియాబాద్‌లోని విజయ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భవ్య శర్మ అనే మహిళ మొత్తం ముగ్గురు వ్యక్తులను వివాహం చేసుకుంది. తొలిసారిగా యోగేంద్ర కుమార్‌ను పెళ్లి చేసుకుంది. అప్పుడు తనకు తాను బేబీగా పరిచయం చేసుకుంది. పెళ్లి అయిన కొద్ది రోజులకే వారిద్దరూ విడిపోయారు. ఆ […]

Wife Murder | రెండో భర్తతో రాసలీలల్లో మునిగి తేలుతూ అడ్డంగా బుక్కైన భార్య.. మూడో భర్త చేతిలో హతమైంది. ఈ దారుణ ఘటన ఘజియాబాద్‌లోని విజయ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. భవ్య శర్మ అనే మహిళ మొత్తం ముగ్గురు వ్యక్తులను వివాహం చేసుకుంది. తొలిసారిగా యోగేంద్ర కుమార్‌ను పెళ్లి చేసుకుంది. అప్పుడు తనకు తాను బేబీగా పరిచయం చేసుకుంది. పెళ్లి అయిన కొద్ది రోజులకే వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత తన పేరును అఫ్సానాగా మార్చుకుంది. అనంతరం అన్నీస్ అన్సారీని వివాహమాడింది.
రెండో భర్తతో మగ పిల్లాడికి జన్మనిచ్చింది. ఆ అబ్బాయి వయసు ప్రస్తుతం 16 ఏండ్లు. అయితే కొద్ది నెలల క్రితం అన్సారీ నుంచి దూరమైంది. ఇక భవ్య శర్మగా అవతారమెత్తి.. ఐదు నెలల క్రితం వినోద్ శర్మను పెళ్లి చేసుకుంది. తన 16 ఏండ్ల కుమారుడిని కూడా తన వెంటే తీసుకొచ్చింది.
అయితే భవ్య శర్మ డిసెంబర్ 24వ తేదీన ఇండోర్ వెళ్లింది. ఈ క్రమంలో వినోద్ శర్మ ఆమెకు వీడియో కాల్ చేశాడు. అదే సమయంలో రెండో భర్త అన్సారీతో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు గమనించాడు. 25వ తేదీన వినోద్ వద్దకు భవ్య వచ్చింది. ఇక పిల్లాడిని ఆడుకోవడానికి బయటకు పంపించేశాడు వినోద్. అన్సారీ వద్దకు ఎందుకు వెళ్లావంటూ భార్యను వినోద్ ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
భవ్యను చంపి.. రాత్రంతా మృతదేహంతోనే..
ఇక భవ్యను వినోద్ పదునైన ఆయుధంతో చంపేశాడు. ఆ తర్వాత రక్తపు మరకలను నీటితో తుడిచేశాడు. డెడ్‌బాడీని మంచం కిందకు తోసేశాడు. కుమారుడు వచ్చి అమ్మ ఎక్కడుందని ప్రశ్నించగా, బెడ్రూంలో నిద్రిస్తుందని బుకాయించాడు. ఆ రాత్రంతా భార్య మృతదేహం వద్దనే ఉండిపోయాడు.
దుర్వాసన రావడంతో.. 26న వెలుగులోకి..
భవ్య ఉన్న గదిలో నుంచి దుర్వాసన రావడంతో.. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా వినోద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, చేసిన నేరాన్ని అంగీకరించాడు.