Talasani Srinivas Yadav | ఆ.. గిరిజన బిడ్డ కు సారీ చెప్పా: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani Srinivas Yadav | విధాత: వారం క్రితం ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా నేను ఓ వ్యక్తిని నెట్టివేసిన ఘటనపై ఇప్పటికే సారీ చెప్పానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలో ట్రోల్ అవుతున్న సందర్భంగా మంత్రి స్పందించారు. ఘటనపై స్పష్టత ఇచ్చారు. ‘బ్రిడ్జి ప్రారంభోత్సవానికి కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడింది. ఓ వ్యక్తి నా కాలు తొక్కుతూ ముందుకెళ్లాడు. నా కాలుకు గాయమై రక్తమొచ్చింది. […]

  • By: krs    latest    Aug 25, 2023 2:26 AM IST
Talasani Srinivas Yadav | ఆ.. గిరిజన బిడ్డ కు సారీ చెప్పా: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani Srinivas Yadav |

విధాత: వారం క్రితం ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా నేను ఓ వ్యక్తిని నెట్టివేసిన ఘటనపై ఇప్పటికే సారీ చెప్పానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలో ట్రోల్ అవుతున్న సందర్భంగా మంత్రి స్పందించారు. ఘటనపై స్పష్టత ఇచ్చారు.

‘బ్రిడ్జి ప్రారంభోత్సవానికి కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడింది. ఓ వ్యక్తి నా కాలు తొక్కుతూ ముందుకెళ్లాడు. నా కాలుకు గాయమై రక్తమొచ్చింది. ఆ సందర్భంగానే ఆ వ్యక్తిని నెట్టి వేశా. సోషల్ మీడియాలో దీన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు.

అతను బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్ బాబు అని తెలిసింది. ఆయన గిరిజన బిడ్డ. వెంటనే ఆయనకు ఫోన్ చేసి సారీ చెప్పా’ అంటూ వివరించారు. దీనిపై కావాలనే తనపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు.

నేను బడుగు బలహీన దళిత, మైనార్టీ గిరిజన వర్గాల గొంతుకను.. తెలంగాణలో జరిగే సేవాలాల్, కొమురం భీం జయంతి కార్యక్రమాలు ముందుండి చేస్తాను. ఆరోజు జరిగిన ఘటనపై వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే క్షమాపణ చెప్పుతున్నా అని అన్నారు.