నవీన్ మిట్టల్ కూడా.. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ
Navin Mittal | ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ కూడా బదిలీ అయ్యారు. ఆయనను రెవెన్యూ శాఖ ముఖ్య కారద్యర్శిగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎల్ఏ కమిషనర్‌గా నవీన్ మిట్టల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నవీన్ మిట్టల్ ఈ అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జీవో 153 జారీ అయింది. అయితే ఇంటర్మీడియట్ బోర్డుపై బోర్డు […]

Navin Mittal | ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ కూడా బదిలీ అయ్యారు. ఆయనను రెవెన్యూ శాఖ ముఖ్య కారద్యర్శిగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎల్ఏ కమిషనర్‌గా నవీన్ మిట్టల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నవీన్ మిట్టల్ ఈ అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జీవో 153 జారీ అయింది.
అయితే ఇంటర్మీడియట్ బోర్డుపై బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ బోర్డుకు సమాంతరంగా మరో కమిషనర్ వ్యవస్థ నడుస్తోందని ఆయన ఆరోపించిన విషయం విదితమే. ఒక వ్యక్తి వ్యవస్థను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపణలు చేశారు. ఇంటర్ బోర్డు ఆఫీసులోని సీసీ టీవీ కెమెరాలను ట్యాంపర్ చేశారని, తాను ఓ అధికారితో మాట్లాడిన విషయాలు మూడో వ్యక్తికి క్షణాల్లోనే తెలిసిపోతున్నాయని నవీన్ తెలిపారు. సీసీ కెమెరాల పాస్ వర్డ్ కూడా ప్రస్తుతం ఉద్యోగంలో లేని వ్యక్తి రన్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మాన్యువల్ వాల్యువేషన్ ద్వారా డబ్బులు సంపాదించే వారే ఆన్‌లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఇంటర్ బోర్డులో డాటా చోరి అయిందని.. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు నవీన్ మిట్టల్ తెలిపారు.
ట్రేస్పాస్ కింద బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంటర్ బోర్డు సెక్రటరీగా కొనసాగుతున్న నవీన్ మిట్టల్‌ను మంగళవారం రాత్రి బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం ఈ పరిణామం అటు ప్రభుత్వ వర్గాల్లో, ఇటు జూనియర్ లెక్చరర్ల సంఘాల్లో చర్చానీయాంశమైంది.