• Telugu News
  • /Telangana

Telangana IAS transfers| తెలంగాణలో 10మంది ఐఏఎస్ ల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 10మంది ఐఏఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. స్థాన చలనం పొందిన ఐఏఎస్ లు వెంటనే తమకు కేటాయించిన కొత్త బాధ్యతలను స్వీకరిస్తున్నారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Feb 11, 2026, 1:59 pm IST
Read Time: 2 mins
Telangana IAS transfers| తెలంగాణలో 10మంది ఐఏఎస్ ల బదిలీ

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 10మంది ఐఏఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రజావాణి రాష్ట్ర నోడల్‌ అధికారిగా కాత్యాయనీ దేవి, జలమండలి జేఎండీగా మయాంక్‌ మిట్టల్‌, పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శిగా రఘురామ్‌శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా దివ్యకు అదనపు బాధ్యతలు అప్పగించింది. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌ నియమితులయ్యారు.

ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌కుమార్‌ సుల్తానియాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. స్థాన చలనం పొందిన ఐఏఎస్ లు వెంటనే తమకు కేటాయించిన కొత్త బాధ్యతలను స్వీకరిస్తున్నారు.