కివీ గ్రిల్‌డ్.. గెలుపంటే ఇదేరా!
శతకంతో చెలరేగిన గిల్.. చితక్కొట్టిన త్రిపాఠి.. ఆకాశమే హద్దుగా చెలరేగిన బ్యాటర్లు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 రన్స్ చేసిన హార్దిక్ సేన 168 రన్స్ తేడాతో టీమ్ ఇండియా ఘన విజయం పేసర్ల దెబ్బకు 66 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ 2-1 తేడాతో టీ20 సిరీస్ భారత్ కైవసం.. విధాత: పరుగుల పరంగా అతిపెద్ద విజయం.. కఠినమైన ప్రత్యర్థిపై అలవోక గెలుపు.. వారెవ్వా భారత్.. సెహభాశ్ గిల్.. సూపర్ పాండ్యా.. అదరగొట్టిన త్రిపాఠి.. […]

- శతకంతో చెలరేగిన గిల్.. చితక్కొట్టిన త్రిపాఠి..
- ఆకాశమే హద్దుగా చెలరేగిన బ్యాటర్లు
- 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 రన్స్ చేసిన హార్దిక్ సేన
- 168 రన్స్ తేడాతో టీమ్ ఇండియా ఘన విజయం
- పేసర్ల దెబ్బకు 66 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్
- 2-1 తేడాతో టీ20 సిరీస్ భారత్ కైవసం..
విధాత: పరుగుల పరంగా అతిపెద్ద విజయం.. కఠినమైన ప్రత్యర్థిపై అలవోక గెలుపు.. వారెవ్వా భారత్.. సెహభాశ్ గిల్.. సూపర్ పాండ్యా.. అదరగొట్టిన త్రిపాఠి.. కళ్లు చెదిరే క్యాచ్ లతో ఔరా అనిపించిన సూర్యకుమార్.. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ అదుర్స్.. ఆటంటే ఇదీ.. గెలుపంటే ఇలా ఉండాలి.. ప్రత్యర్థిపై కాస్తంత కూడా కనికరం చూపించలేదు.
పరుగుల సునామీ సృష్టించి.. వికెట్ల వేటలో సింహాల్లా గర్జించి.. ఫీల్డింగ్‌లో చిరుతలను తలపించిన టీమ్ ఇండియా.. నిర్ణయాత్మక గేమ్‌లో.. సిరీస్ విజయం దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కదం తొక్కారు.. శివమెత్తారు.. మొత్తానికి కివీస్‌ను చితక్కొట్టారు.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమ్ ఇండియా చిరస్మరణీయ విజయం సాధించింది. వన్డే సిరీస్ తోపాటూ టీ20 సిరీస్‌లోనూ బలమైన కివీస్‌ను అలవోకగా ఓడించి అనేక రికార్డుల సృష్టించి సిరీస్ పట్టిన టీమ్ ఇండియా ఆటగాళ్లకు జయహో..
235 పరుగుల టార్గెట్ ఉన్నా.. కివీస్ బ్యాటర్లు కూడా తక్కువోళ్లేమీ కాదు.. ప్రత్యేకించి టీ20 స్పెషలి స్టులు.. తీరా బ్యాటింగ్‌కు దిగిన కివీలకు భారత పేసర్ల నుంచి దిమ్మతిరిగే షాక్.. తొలి ఓవర్లోనే సూర్యకుమార్ కళ్లు చెదిరే క్యాచ్‌తో పిన్ అలెన్ వికెట్ పడగొట్టిన హార్దిక పాండ్యా వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు.. ఆ వెంటనే అర్షదీప్ సింగ్ తన పేస్ పదును రుచి చూపించాడు.
కెప్టెన్ ఒక వికెట్ పడగొడితే నేనూరుకుంటానా అన్నట్లుగా చెలరేగి తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు అదీ ప్రమాదకర డెవాన్ కాన్వేను తొలి బంతికి ఔట్ చేయగా… చాప్ మన్‌ను డకౌట్‌గా పెవిలియన్కు పంపాడు. ఒకవైపు హార్దిక్ మరోవైపు పేసర్లు ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు, శివం మావి 2 వికెట్లు పడగొట్టారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే సరికి కివీస్ డేంజర్ బ్యాట్స్ మన్ పిలిప్స్, బ్రేస్ వెల్, ఆఖరి వికెట్‌గా మిచెల్ ఔటయ్యారు. గ్రౌండ్ ఫీల్డింగ్‌లో కీలకమ్యాచ్‌లో సూర్య అదుర్స్ అనిపించాడు.
స్లిప్‌లో మూడడుగుల పైకి ఎగిరి రెండు అత్యంత క్లిష్టమైన క్యాచ్‌లు అందుకున్న సూర్య.. బౌండర్ లైన్‌కు ఇంచుల దూరంలో సాంట్నర్ కొట్టిన షాట్‌ను అందుకుని బేలన్స్ నిలుపుకున్న తీరు అద్భుతం అనిపించింది. కివీస్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.. వారు తేరుకునే చాన్స్ లేకుండానే మ్యాచ్‌తో పాటు సిరీస్ చేజారింది. సమష్టి కృషితో చెలరేగిన టీమ్ ఇండియా చాన్నాల్లు గుర్తుండిపోయే మహత్తర విజయం అందించింది.. హ్యాట్సాఫ్ టీమ్ ఇండియా..
Captain @hardikpandya93 collects the @mastercardindia trophy from BCCI president Mr. Roger Binny & BCCI Honorary Secretary Mr. Jay Shah