భారత్ పేద దేశం కాదు.. అమెరికా కంటే ధనవంతమైనది: CM KCR
విధాత: బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ దేశంలో మార్పు తెచ్చేందుకే బీఆర్ఎస్ ఏర్పాటు చేశాం. దేశ పరిస్థితులు చూసిన తర్వాత టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాం. చత్రపతి శివాజీ, అంబేద్కర్, ఫూలే వంటి మహానీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. దేశంలో భారీ మార్పు రావాల్సిన అవసరం ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 […]

విధాత: బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ
దేశంలో మార్పు తెచ్చేందుకే బీఆర్ఎస్ ఏర్పాటు చేశాం. దేశ పరిస్థితులు చూసిన తర్వాత టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాం. చత్రపతి శివాజీ, అంబేద్కర్, ఫూలే వంటి మహానీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. దేశంలో భారీ మార్పు రావాల్సిన అవసరం ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయింది.
ఈ కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వాలు, ప్రధానులు మారారు కానీ దేశ ప్రజల తలరాత మాత్రం మారలేదు. ఎందరో నేతలు ఎన్నో మాటలు చెప్పారు. కానీ ఆ మేరకు మార్పులు రాలేదు. కనీసం తాగు నీరు, విద్యుత్ కూడా ఇవ్వలేదు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించండి.
ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు, ఎంతో ఆవేదన ఉంటేనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించినా చివరకు ఆత్మహత్యలు తప్పట్లేదు. అందుకే అబ్‌కీ బార్.. కిసాన్ సర్కార్.. నినాదంతో బీఆర్ఎస్ వచ్చింది. దేశ దుస్థితిని చూసిన తర్వాత ఈ స్థితిని మార్చాలని సంకల్పించాం. మా సంకల్పానికి దేశ వ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది.
భారత్ పేద దేశం కాదు.
భారత్ పేద దేశం ఎంత మాత్రమూ కాదు.. భారత్ అమెరికా కంటే ధనవంతమైన దేశం. భారత్‌లో సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ, ప్రజలు వంచనకు గురవుతున్నారు. భారత్‌లో ఉన్నంత సాగుయోగ్యమైన భూమి ఇంకొకటి లేదు. భారత్ బుద్ధి జీవుల దేశం. నాగలి పట్టే చేతులు.. శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయి.
ఎన్నికల్లో గెలవాల్సింది నాయకులు కాదు.. ప్రజలు, రైతులు గెలవాలి. ఆ సమయం ఎన్నాళ్లో ఎదురు చూశాం.. ఇక ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మహారాష్ట్రలో ఇన్ని నదులున్నా.. నీటి కరువు ఎందుకు వచ్చింది. 54 ఏండ్లు కాంగ్రెస్.. 16 ఏండ్లు బీజేపీ పాలించాయి. ఇవి ఏం సాధించాయి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం తప్పా చేసిందేమీ లేదు. నువ్వు అంత తిన్నావంటే.. నువ్వు ఇంత తిన్నావని కాంగ్రెస్, బీజేపీ తిట్టుకుంటాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ జింబాబ్వేలో..
ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ చిన్న దేశమైన జింబాబ్వేలో ఉంది. చాలా దేశాల్లో 5 వేల టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ మన దేశంలో ఈ స్థాయిలో ప్రాజెక్టులు లేవు. ఇంత విశాల భారత్‌లో కనీసం 2 వేల టీఎంసీల రిజర్వాయర్ ఎందుకు లేదు? అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో రిజర్వాయర్లు కాదు.. జల వివాదాలు, ట్రిబ్యునళ్లు పెరిగిపోయాయి.
కేంద్రం ట్రిబ్యునళ్లు వేసి చేతులు దులుపుకుంటుంది. రాష్ట్రాల మధ్య జల వివాదాలను కేంద్రం పరిష్కరించడం లేదు. ట్రిబ్యునళ్ల పేరుతో సంవత్సరాల కొద్ది జల వివాదాలు పెండింగ్‌లో పెడుతారు. ట్రిబ్యునళ్ల పేరుతో ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకుండా తిప్పుతారు. చిత్తశుద్ధితో కృషి చేస్తే దేశంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చు. గట్టిగా అనుకుంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వొచ్చు.
8 ఏండ్ల క్రితం తెలంగాణలోనూ ఎన్నో సమస్యలు ఉండేవి. కొన్నేండ్ల క్రితం తెలంగాణలో సాగు, తాగునీరు, విద్యుత్ కొరత ఉండేది. తెలంగాణలో క్రమంగా అన్ని సమస్యలను అధిగమించాం. తెలంగాణలో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతులకు ఏడాదికి ఎకరానికి రూ. 10వేల చొప్పున రైతుబంధు ఇస్తున్నాం. రైతు ఏ కారణంతో చనిపోయినా రూ. 5 లక్షల బీమా ఇస్తున్నాం. తెలంగాణలో ఇంటింటికి సురక్షిత తాగునీటిని నల్లా ద్వారా అందిస్తున్నాం.
ఇవన్నీ తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు. మీకు ఈ పథకాలన్నీ కావాలా.. వద్దా..? ఇలాంటి పథకాలు కావాలంటే రైతు సర్కార్ రావాలి. దేశంలో పుష్కలంగా బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గుతో దేశమంతటా 24 గంటల కరెంట్ ఇవ్వొద్దు. తెలంగాణలో వచ్చినా మార్పు దేశమంతా రావాల్సి ఉంది. రైతు సర్కార్ వస్తేనే దేశంలో మార్పు వస్తుంది. బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తే రెండేండ్లలోనే మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్ ఇస్తాం.