India ODI World Cup 2023 Squad | వ‌ర‌ల్డ్‌కప్‌కు టీమిండియా ఖ‌రారు..! నేడే.. రేపో ప్ర‌క‌ట‌న‌..!

India ODI World Cup 2023 Squad | ఈ ఏడాది భార‌త్ వేదిక ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగ‌నున్న‌ది. మెగా టోర్నీ కోసం భార‌త జ‌ట్టు ఎంపిక దాదాపు పూర్తికావొచ్చింది. ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ప్ర‌పంచక‌ప్‌లో పాల్గొనే దేశాలు సెప్టెంబ‌ర్ 5వ తేదీలోగా జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాల్సి ఐసీసీ నిబంధ‌న‌లున్నాయి. ఏవైనా మార్పులు ఉంటే త‌ర్వాత చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్ర‌మంలో బీసీసీఐ జ‌ట్టును ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఆసియా క‌ప్‌-2023లో భార‌త్ - పాక్ […]

India ODI World Cup 2023 Squad | వ‌ర‌ల్డ్‌కప్‌కు టీమిండియా ఖ‌రారు..! నేడే.. రేపో ప్ర‌క‌ట‌న‌..!

India ODI World Cup 2023 Squad |

ఈ ఏడాది భార‌త్ వేదిక ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగ‌నున్న‌ది. మెగా టోర్నీ కోసం భార‌త జ‌ట్టు ఎంపిక దాదాపు పూర్తికావొచ్చింది. ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ప్ర‌పంచక‌ప్‌లో పాల్గొనే దేశాలు సెప్టెంబ‌ర్ 5వ తేదీలోగా జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాల్సి ఐసీసీ నిబంధ‌న‌లున్నాయి. ఏవైనా మార్పులు ఉంటే త‌ర్వాత చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఈ క్ర‌మంలో బీసీసీఐ జ‌ట్టును ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఆసియా క‌ప్‌-2023లో భార‌త్ – పాక్ మ్యాచ్ త‌ర్వాత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ రాహుల్ ద్రావిడ్‌, చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ స‌మావేశమ‌య్యారు. ఈ భేటీలో టీమ్‌పై చ‌ర్చించారు. మెగా టోర్నీలో ఫాస్ట్ బౌల‌ర్ ప్ర‌సిద్ధ్ కృష్ణ‌తో పాటు యువ సంచ‌ల‌నం తిల‌క్ వ‌ర్మ‌కు వ‌ర‌ల్డ్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకోలేక‌పోయార‌ని తెలుస్తున్న‌ది.

కేఎల్ రాహుల్‌కు అవ‌కాశం..

స‌మాచారం ప్ర‌కారం.. ఫిట్‌నెస్ లేమితో బాధ‌ప‌డుతున్న కేఎల్ రాహుల్‌ను సైతం జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది. వ‌ర‌ల్డ్ క‌ప్ మొద‌ల‌య్యే నాటికి ఫిట్‌గా లేక‌పోతే అత‌ని ప్లేస్‌లో సంజూశాంస‌న్‌ని ఎంపిక చేయ‌నున్నారు. అయితే, సంజూను రిజ‌ర్వ్ ప్లేయ‌ర్‌గా జ‌ట్టుతోనే ఉండ‌నున్నాడు.

రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో బ‌రిలోకి దిగ‌నున్న టీమిండియాకు.. మిడిల్ ఆర్డ‌ర్‌లో బ్యాట్‌తో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న ఇషాన్ కిష‌న్‌కి సైతం జ‌ట్టులో చోటు ద‌క్కింద‌ని స‌మాచారం. అలాగే ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్‌, సూర్య కుమార్ యాద‌వ్‌తో బ్యాటింగ్ లైన‌ప్ ఉండ‌నున్న‌ది.

అలాగే అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్‌కు కూడా జట్టులో చోటు ద‌క్కింద‌ని స‌మాచారం. అయితే, సెల‌క్ష‌న్ క‌మిటీ, టీమ్ మేనేజ్‌మెంట్ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టింది. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ పేస్ బౌలింగ్ లైన‌ప్ ఉండ‌గా.. స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ కూడా చోటు ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

వ‌ర‌ల్డ్‌కు భార‌త జ‌ట్టు అంచ‌నా..

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్‌ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.