ODI World Cup | 13వ వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం
హైదరాబాద్ లో మూడు లీగ్ మ్యాచ్ లు ODI World Cup | విధాత: 13వ వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ఇంకో 51 రోజుల్లో జరగబోనుంది. నాలుగేళ్లకు ఓసారి జరిగే ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదివరకే భారత్ గడ్డపై నాలుగు ప్రపంచకప్ పోటీలు జరిగాయి. పాకిస్తాన్, బంగ్గాదేశ్, శ్రీలంకతో ఉమ్మడిగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చాయి. తాజాగా తొలిసారి భారత్ మాత్రమే ప్రపంచకప్ నిర్వహించబోతోంది. ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తుంది. మొత్తం 10 […]
- హైదరాబాద్ లో మూడు లీగ్ మ్యాచ్ లు
ODI World Cup | విధాత: 13వ వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ఇంకో 51 రోజుల్లో జరగబోనుంది. నాలుగేళ్లకు ఓసారి జరిగే ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదివరకే భారత్ గడ్డపై నాలుగు ప్రపంచకప్ పోటీలు జరిగాయి. పాకిస్తాన్, బంగ్గాదేశ్, శ్రీలంకతో ఉమ్మడిగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చాయి. తాజాగా తొలిసారి భారత్ మాత్రమే ప్రపంచకప్ నిర్వహించబోతోంది. ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తుంది. మొత్తం 10 వేదికల్లో మ్యాచ్ లు జరుగుతాయి. హైదరాబాద్ లో మూడు లీగ్ మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తుంది.

ఈసారి టోర్నీలో పది జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టూ మిగతా తొమ్మిది జట్లలో ఒక్కోలీగ్ మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశలో టాప్ 4లో నిలిచే జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 5న మ్యాచ్ మొదలై, నవంబరు 19న జరిగే ఫైనల్ మ్యాచ్తో టోర్నీ ముగుస్తుంది. టోర్నీలో 45 లీగ్ మ్యాచ్ లు సహా, మొత్తం 48 మ్యాచ్ లు జరుగుతాయి. ప్రతి క్రికెట్ అభిమానిలోనూ ఉద్వేగాన్ని రేకెత్తించే టోర్నీ ఇది. ఈసారి మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తుండడంతో ఇక్కడి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. సొంతగడ్డపై రోహిత్ సేన భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram