IRCTC Tour Package | సాయిబాబా భక్తులకు ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్..! తక్కువ ధరకే హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటన..!
IRCTC Tour Package | షిర్డీ సాయిబాబా భక్తులకు ఐఆర్‌సీటీసీ బంఫర్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రారంభంకానున్నది. సాయి సన్నిధాన్ ఎక్స్ హైదరాబాద్ (SAI SANNIDHI EX HYDERABAD) పేరుతో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెల 17 నుంచి 23 వరకు ప్యాకేజీ అందుబాటులో ఉండనున్నది. రెండు రాత్రులు, మూడు రోజులు పాటు టూర్ ప్యాకేజీలో వివిధ ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంది. జర్నీ సాగేదిలా.. తొలి రోజు సికింద్రాబాద్ […]

IRCTC Tour Package | షిర్డీ సాయిబాబా భక్తులకు ఐఆర్‌సీటీసీ బంఫర్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రారంభంకానున్నది. సాయి సన్నిధాన్ ఎక్స్ హైదరాబాద్ (SAI SANNIDHI EX HYDERABAD) పేరుతో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెల 17 నుంచి 23 వరకు ప్యాకేజీ అందుబాటులో ఉండనున్నది. రెండు రాత్రులు, మూడు రోజులు పాటు టూర్ ప్యాకేజీలో వివిధ ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంది.
జర్నీ సాగేదిలా..
తొలి రోజు సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 06.05 గంటలకు బయలుదేరాల్సి ఉంటుంది. రాత్రంతా ప్రయాణం కొనసాగుతుంది. రెండో రోజు ఉదయం 7.10 గంటలకు నగర్‌సోల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సు మార్గం ద్వారా షిర్డీకి బయలుదేరుతారు. హోటల్‌కి చేరుకుంటారు. ఆ తర్వాత సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఆ తర్వాత శని శింగణాపూర్‌కు వెళ్తారు. అక్కడి నుంచి నగర్‌సోల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 08.30 గంటలకు మళ్లీ తిరుగు ప్రయాణమవుతారు. రాత్రంతా ప్రయాణం కొనసాగుంది. మూడో రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఎంతంటే..?
ఇక ప్యాకేజీలో ధరల విషయానికి వస్తే సింగిల్ షేరింగ్‌కు రూ.12,100 ఉండగా.. ఇద్దరి కలిపి బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి కలిపి రూ.6530 ధర ఉంటుంది. టిపుల్ షేరింగ్‌లో రూ.5400 ధర నిర్ణయించారు. కంఫార్ట్ క్లాస్ల్ కోచ్‌లో ప్రయాణానికి ఈ ధరలు వర్తిస్తాయి. చిన్నారులకు సైతం ధరలు ఉండనున్నాయి. ఇక స్టాండర్డ్ క్లాస్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ.8510, డబుల్ షేరింగ్‌కు రూ.4840 ధరను ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కవర్‌కానున్నాయి. పూర్తి వివరాలకు https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR009 లింక్‌లో చూడవచ్చు.