Jacqueline Fernandez | మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ సుకేశ్ చంద్రశేఖర్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు మరో లేఖ రాశాడు. ఈస్టర్ సందర్భంగా జైలు నుంచి ప్రత్యేకంగా లేఖ పంపడి.. పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే తనపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచే ప్రయత్నం చేశాడు సుకేశ్. లేఖలో ‘మై బేబీ.. మై బొమ్మా జాక్వెలిన్. బేబీ ఐ విష్ యు వెరీ హ్యాపీ ఈస్టర్! ఈ ఏడాది మీకు ఇష్టమైన పండుగల్లో ఇది ఒకటి’ […]
Jacqueline Fernandez | మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ సుకేశ్ చంద్రశేఖర్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు మరో లేఖ రాశాడు. ఈస్టర్ సందర్భంగా జైలు నుంచి ప్రత్యేకంగా లేఖ పంపడి.. పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే తనపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచే ప్రయత్నం చేశాడు సుకేశ్. లేఖలో ‘మై బేబీ.. మై బొమ్మా జాక్వెలిన్. బేబీ ఐ విష్ యు వెరీ హ్యాపీ ఈస్టర్! ఈ ఏడాది మీకు ఇష్టమైన పండుగల్లో ఇది ఒకటి’ అని ఆ లేఖలో పేర్కొన్నాడు. జైలు శిక్ష అనుభవిస్తున్న తాను ఆమె చిన్న పాపలాంటి చిరునవ్వును మిస్ అవుతున్నానని తెలిపాడు.
‘మై బేబీ, నువ్వు ఎంత అందంగా ఉంటావో నీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ గ్రహం మీద నీ అంత అందంగా ఎవ్వరూ లేరు.. మై ర్యాబిట్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నువ్వు ఎప్పటికీ నాదానివే..!’ అంటూ జాక్వెలిన్‌పై తన ప్రేమను మరో వ్యక్తం చేశాడు. త్వరలోనే ఇబ్బందులన్నీ తొలగిపోతాయని, అందరినీ చూడబోతున్నానని, వచ్చే ఈస్టర్ జాక్వెలిన్‌కు మరింత స్పెషల్‌గా ఉండబోతుందని పేర్కొన్నాడు. ఇంకా లేఖలో ‘తు మైలే, ఔర్ దిల్ కిలే, ఔర్ జీనే కో క్యా చాహియే’ కొత్త వెర్షన్ విన్నప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నాను’ అంటూ పేర్కొన్నాడు. జాక్వెలిన్‌తో పాటు ఆమె తల్లిదండ్రులకు శుభాకాంక్షలు చెప్పాడు.
గతంలోనూ పలుమార్లు జాక్వెలిన్‌కు గతంలో లేఖలు రాసిన విషయం తెలిసిందే. బర్త్ డేతో పాటు హోలీ రోజున లేఖలు పంపాడు. రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో సుకేశ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జాక్వెలిన్ నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఈడీ ఆరోపించింది. ఈ విషయంలో పలుమార్లు విచారించింది. అయితే, సుకేశ్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించింది. తన జీవితంతో ఆడుకుని.. కెరీర్‌ను చెడగొట్టాడని న్యాయస్థానం ముందు వాగ్మూలం ఇచ్చింది. హోంశాఖలో అధికారిగా పరిచయం చేసుకుని, తనను సంబంధంలేని కేసులో ఇరికించాడని ఆవేదన వ్యక్తం చేసింది.