Jailer | జైలర్ నిర్మాత గొప్ప మనసు.. 300 మందికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్
Jailer | సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం జైలర్. ఆగస్టు 10న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. విడుదలైన అన్ని చోట్ల కూడా మూవీకి మంచి ఆదరణ లభించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టిన ఈ చిత్రం తమిళ ఇండస్ట్రీ లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచి అందరిలో తెగ సంతోషాన్ని నింపిది. […]

Jailer |
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం జైలర్. ఆగస్టు 10న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. విడుదలైన అన్ని చోట్ల కూడా మూవీకి మంచి ఆదరణ లభించింది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టిన ఈ చిత్రం తమిళ ఇండస్ట్రీ లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచి అందరిలో తెగ సంతోషాన్ని నింపిది. జైలర్ చిత్రం హిట్ కావడంతో ఈ సినిమాని నిర్మించిన కళానిధి మారన్ కి భారీగా లాభాలు వచ్చి పడ్డాయి.దీంతో ‘జైలర్’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగం అవుతూ సినిమా కోసం పని చేసిన వారికి వరుసగా బహుమతులు ఇస్తూనే ఉన్నారు.
ముందుగా రజినీకాంత్‌కి అదనంగా చెక్ ఇచ్చాడని ప్రచారం జరిగింది. అనంతరం రజినీ ఇంటికి రెండు లగ్జరీ బీఎండబ్ల్యూ కార్లను తీసుకెళ్లి పెట్టాడు. ఏది కావాలో అది తీసుకోమని రజినీకి బంపర్ ఆఫర్ ఇవ్వగా, కాస్త తక్కువ రేటున్న బీఎండబ్ల్యూ కారును అందుకున్నట్టు సమాచారం.
ఇక ఆ తరువాత దర్శకుడు మరో లగ్జరీ కారుని గిఫ్ట్‌గా సంగీత దర్శకుడికి ఇచ్చాడు. ఇలా మంచి సర్ ప్రైజ్‌లు ఇచ్చి చిత్ర బృందాన్ని సంతోషింపజేశాడు కళానిధి మారన్. ఇక ఇప్పుడు జైలర్ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు.
దాదాపు 300 మందికి గోల్డ్ కాయిన్‌ను బహుమతిగా ఇచ్చినట్టు సమాచారం. అంతేకాక వాళ్ళందరికీ ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారట. ఈవెంట్లో భారీ కేక్ కట్ చేసిన అనంతరం గోల్డ్ కాయిన్స్ ఇచ్చాక వాళ్ళ అందరితో కలిసి కూర్చుని భోజనం కూడా చేశారని అంటున్నారు.
ఈ ఈవెంట్‌లో నిర్మాత కళానిది మారన్‌తో పాటు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, పలువురు చిత్ర బృందం కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సన్ పిక్చర్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..’300 మందికి పైగా వ్యక్తులను గోల్డ్ కాయిన్స్ తో నిర్మాత సన్మానించారని తెలియజేసాడు.
మొత్తానికి నిర్మాత తన సినిమాకి వచ్చిన లాభాలని కొంత టీంతో కూడా పంచుకోవడంతో ఆయనపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రజినీతో కళానిధి మారన్ మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి క్లారిటీ రానుంది.