AGRI SHOW|| హైదరాబాద్ లో అతి పెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్

ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్ లో అగ్రి షో పేరుతో అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ట్యాంక్ బండ్ దిగువన ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. మూడు రోజుల్లో లక్ష మంది రైతులు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు. దేశ, విదేశాలకు చెందిన నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు 500 కు పైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు

  • By: Subbu |    telangana |    Published on : Jan 31, 2026 7:32 PM IST
AGRI SHOW|| హైదరాబాద్ లో అతి పెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్

విధాత: ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్ లో అగ్రి షో పేరుతో అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ట్యాంక్ బండ్ దిగువన ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. మూడు రోజుల్లో లక్ష మంది రైతులు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు. దేశ, విదేశాలకు చెందిన నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు 500 కు పైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. నూతన యంత్రాలు, ఏఐ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల వంటివి ఎన్నో ప్రదర్శనకు వస్తాయని.. మూడు రోజుల్లో పలు అంశాల పై సదస్సులు సైతం జరుగుతాయని వివరించారు. సందర్శకులు ముందుగానే www.rbagrishow.com వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని.. అలా చేసుకోలేని వాళ్లు నేరుగా రావచ్చని తెలిపారు.