Telangana Journalists | అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు
Telangana Journalists | ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు సమకూరుతాయని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆశాభావం వ్యక్తం చేసింది. సొసైటీ సర్వ సభ్య సమావేశం ఆదివారం నిజాంపేట్‌లోని సొసైటీ స్థలంలో జరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జేఎన్‌జే సొసైటీ పట్ల సానుకూల వైఖరి అవలంభిస్తూ, ప్రాంతీయ బేధాలు లేకుండా సభ్యులందరికి స్థలాలు అందాలని విధాన నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌కు సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. […]

Telangana Journalists | ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు సమకూరుతాయని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆశాభావం వ్యక్తం చేసింది.
సొసైటీ సర్వ సభ్య సమావేశం ఆదివారం నిజాంపేట్‌లోని సొసైటీ స్థలంలో జరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జేఎన్‌జే సొసైటీ పట్ల సానుకూల వైఖరి అవలంభిస్తూ, ప్రాంతీయ బేధాలు లేకుండా సభ్యులందరికి స్థలాలు అందాలని విధాన నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌కు సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది.
అదే విధంగా, హైదరాబాద్‌లో అర్హులైన జర్నలిస్టులకు అందరికి స్థలాలు కల్పించే దిశగా ప్రణాళిక చేయమని మంత్రి కేటీఆర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ఆదేశించడం జరిగింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో జేఎన్‌జే సొసైటీతో పాటు హౌసింగ్ సొసైటీలతో సంబంధం లేని మిగతా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్న కేటీఆర్ ఆలోచన, తదనుగుణంగా ప్రెస్ అకాడమి అధ్వర్యంలో కసరత్తు ప్రారంభించడం శుభపరిణామం అని సమావేశం అభిప్రాయ పడింది. ఇందుకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సొసైటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
జేఎన్‌జే సొసైటీకి మిగిలిన 38 ఎకరాల స్థలం వీలైనంత తొందరగా సొసైటీకి అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సమావేశం విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్, అందోల్ ఎమ్మెల్యే సీహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. కోట్లాది రూపాయలు చెల్లించినా దశాబ్ద కాలంగా అప్పటి ప్రభుత్వాలు సొసైటీకి భూమి అప్పగించలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంపేట్‌లోని 32 ఎకరాలు సొసైటీకి అప్పగించమని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అలాగే గత ఆగస్టులో సొసైటీకి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు రావడానికి ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ కీలకం అయింది. ఈ దిశగా ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రికి, సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు సొసైటీ తరఫున క్రాంతి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు.
సర్వసభ్య సమావేశానికి సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రస్తుత కమిటీ నేతృత్వంలోనే పేట్ బషీరాబాద్ స్థలం సాధించాలని కోరుతూ సర్వసభ్య సమావేశం కమిటి పట్ల తమ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. జేఎన్‌జే సర్వసభ్య సమావేశంలో సీఈఓ వంశీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పల్లె రవి, రవికాంత్ రెడ్డి, నేమాని భాస్కర్, జ్యోతి ప్రసాద్‌లు పాల్గొన్నారు.