వైజాగ్ నుంచి పాల్.. వరంగల్ నుంచి బాబుమోహన్
తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు.

- ఏపీలో ఒంటరిగానే ప్రజాశాంతి పోటీ
- తెలంగాణలో పొత్తులకు అవకాశం
విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వైజాగ్ లోక్‌సభ స్థానం నుంచి నేను, తెలంగాణలో వరంగల్ నుంచి బాబు మోహన్ పోటీ చేయనున్నట్లుగా తెలిపారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
ఏపీలో ఎవరితో పొత్తు లేకుండా అన్ని స్థానాలలో పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే తెలంగాణలో మాత్రం ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోడానికి సిద్ధంగా ఉన్నామని కేఏ పాల్ వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని, పార్లమెంటులో ప్రజా సమస్యలపై తమ గళం వినిపిస్తామని పాల్ ధీమా వ్యక్తం చేశారు.